Published : 22 Sep 2020 16:32 IST

కళ్లెదుటే భర్త మృతి..జీర్ణించుకోలేక భార్య కూడా!

దంపతులిద్దరికీ కరోనా పాజిటివ్‌
చిత్తూరు జిల్లా పెద్ద తిప్పసముద్రంలో విషాదం

పెద్ద తిప్పసముద్రం: కట్టుకున్న భర్త కళ్లెదుటే మృతి చెందడాన్ని జీర్ణించుకోలేక భార్య సైతం మరణించింది. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా పెద్ద తిప్ప సముద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన భార్యాభర్తలిద్దరికీ కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ క్రమంలో అంబులెన్స్‌లో ఇరువురినీ మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో భర్తకు గుండెపోటు వచ్చి మృతిచెందారు. తన కంటిముందే భర్త నిర్జీవుడిగా మారడంతో భార్య తట్టుకోలేకపోయింది. ఆమె కూడా అంబులెన్స్‌లోనే కన్నుమూసింది. భార్యాభర్తలిద్దరూ మృతిచెందినట్లు మదనపల్లె ప్రభుత్వాసుపత్రి వైద్యులు ధ్రువీకరించారు. దీంతో మృతదేహాలను వారి స్వగ్రామాలకు తరలించారు. 

Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని