50 అడుగులకుపైగా అనకొండ.. నిజమేనా?

అనకొండ.. ఈ పేరు వింటేనే గుండెల్లో గుబులు రేగుతుంది. వైల్డ్‌ సినిమాల్లో ఎక్కువగా కనిపించే అనకొండ నదిని దాటుతూ...

Published : 01 Nov 2020 20:59 IST

నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో

ఇంటర్నెట్‌ డెస్క్‌: అనకొండ.. ఈ పేరు వింటేనే గుండెల్లో గుబులు రేగుతుంది. వైల్డ్‌ సినిమాల్లో ఎక్కువగా కనిపించే అనకొండ నదిని దాటుతూ వీడియోకి చిక్కితే.. అయితే ఇలాంటి వీడియో రెండేళ్ల కిందట కూడా నెట్టింట్లో హల్‌చల్‌ చేసింది. ఇప్పుడు మళ్లీ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో ఇంతకీ అనకొండ నిజమా? కాదా? అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. బ్రెజిల్‌లోని జింగు రివర్‌ను 50 అడుగులపైగా ఉండే అనకొండ దాటుతున్న వీడియోను ది డార్క్‌ సైడ్‌ ఆఫ్‌ నేచుర్‌ ట్విటర్‌లో పోస్టు చేసింది. దాదాపు ఏడు లక్షలకుపైగా వీక్షణలతోపాటు భారీగా కామెంట్లు వచ్చాయి. అయితే ఆ అనకొండ పొడవు 10 నుంచి 15 అడుగుల్లోపే ఉండొచ్చని ఫ్యాక్ట్‌ చెకింగ్ వెబ్‌సైట్ ఒకటి‌ పేర్కొనడం గమనార్హం. గిన్నిస్‌ బుక్‌ రికార్డ్స్‌ ప్రకారం కూడా ఇప్పటి వరకు నమోదైన అనకొండల్లో అత్యధిక పొడవు 25.2 అడుగులు.. అయితే నెటిజన్లు మాత్రం ఈ వీడియోను బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు.. కావాలంటే మీరూ ఓ లుక్కేయండి మరి..


Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు