
Rowdy Boys: చిన్న సినిమాకు అనుపమ..అంత పారితోషికంతీసుకుందా?
ఇంటర్నెట్ డెస్క్: ఈ సంక్రాంతికి ‘రౌడీ బాయ్స్’తో పలకరించింది నటి అనుపమ పరమేశ్వరన్. నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి హీరోగా నటించిన ఈ చిత్రం.. కాలేజ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కింది. శ్రీ హర్షా కొనుగంటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అనుపమ నటించేందుకు తన రెమున్యరేషన్ని భారీగా పెంచేసిందనే టాక్ వినిపిస్తోంది. సాధారణంగా ప్రతీ సినిమాకి రూ.30లక్షలు తీసుకునే ఈ కేరళ భామ.. ఈ చిన్న చిత్రానికి రూ.50లక్షల పారితోషికాన్ని తీసుకుందట. లిప్‌లాక్ సీన్స్ ఉండటంతో అనుపమ అంత వసూలు చేసిందనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది.
ఈ చిత్రానికి దిల్ రాజు- శిరిష్ నిర్మాతలుగా వ్యవహరించారు. దేవీశ్రీ ప్రసాద్ స్వరాలందించారు. విక్రమ్ సహిదేవ్, కార్తిక్ రత్నం, తేజ్ కూరపాటి, కోమలీ ప్రసాద్, శ్రీకాంత్ అయ్యంగార్, జయప్రకాష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఇవీ చదవండి
ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.