యాపిల్‌ కొత్త బటన్‌.. వెతికితే కనిపించదు!

యాపిల్‌ సంస్థ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లు ఇస్తూ ఉంటుంది. తాజాగా ఐవోఎస్‌ 14 తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో కొన్ని సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌తో పాటు హార్డ్‌వేర్‌.........

Updated : 12 Aug 2022 14:21 IST

ఇంటర్నెట్ డెస్క్: యాపిల్‌ సంస్థ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లు ఇస్తూ ఉంటుంది. తాజాగా ఐవోఎస్‌ 14 తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో కొన్ని సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌తో పాటు హార్డ్‌వేర్‌ ఆప్‌డేట్‌నూ ఇచ్చింది. మరి ఆ బటన్‌ ఎక్కడుందో మీ ఐఫోన్‌ను తనిఖీ చేస్తున్నారా..? అయితే దాన్ని మీరు కనిపెట్టలేరు. ఎందుకంటే అది కంటికి కనిపించని హార్డ్‌వేర్‌ బటన్‌. ఐఫోన్‌ వెనుక ప్యానెల్‌ను ట్యాప్ చేయడం ద్వారా ఈ బటన్‌ను ఉపయోగించొచ్చు. ఇంతకీ దీన్ని ఎలా ఆన్‌ చేయాలి? ఉపయోగాలేంటి?

* మీ ఐఫోన్‌లోని సెట్టింగ్స్‌కు వెళ్లండి. యాక్సెసిబిలిటీలోకి వెళ్లి ‘టచ్‌’ ఓపెన్‌ చేయండి. అలానే కిందకు స్క్రోల్‌ చేస్తూ ఉంటే బ్యాక్‌ ట్యాప్‌ ఆప్షన్‌ను కనిపిస్తుంది. దానిని ఆన్‌ చేయాలి. 
* బ్యాక్‌ ట్యాప్‌ ఆప్షన్‌ను ఎంచుకోగానే ప్రత్యేకంగా స్క్రీన్‌ ఓపెన్‌ అయి డబుల్ ట్యాప్‌, ట్రిపుల్‌ ట్యాప్‌ అని రెండు ఎంపికలు వస్తాయి. 
* మీరు వాటిలో దేనినైనా ఎంచుకున్నప్పుడు, మీ ఫోన్ వెనుక ప్యానెల్‌ను ట్యాప్‌ చేయడం ద్వారా మీరు చేయగలిగే పనుల జాబితా వస్తుంది. 
* లాక్‌ స్క్రీన్‌, స్క్రీన్‌షాట్‌ వంటివి డబుల్‌ లేదా ట్రిపుల్‌ ట్యాప్‌ చేయడం ద్వారా పొందొచ్చు. బ్యాక్‌ ప్యానెల్‌లో  ఫలానా చోట ట్యాప్‌ చేయాలనేం లేదు. ఎక్కడ ట్యాప్‌ చేసినా ఈ బటన్‌ పనిచేస్తుంది.

Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని