iPhone 13: ప్రో ఫొటోగ్రఫీ ఫీచర్స్‌తో ఐఫోన్ 13.. ఇంకా..!
ఐఫోన్ 13 గురించి ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు వెలువడ్డాయి. సెప్టెంబరు లేదా అక్టోబరు నెలలో ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా మరికొన్ని అప్డేట్లకు సంబంధించిన సమాచారం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. గతేడాది విడుదల చేసిన ఐఫోన్ 12కి భిన్నంగా ఇందులో కెమెరా, ఛార్జింగ్, స్టోరేజ్ పరంగా కీలక మార్పులు చేయనున్నారట. వెనుకవైపు మూడు కెమెరాలు ఇస్తారట...
ఇంటర్నెట్‌డెస్క్: ఐఫోన్ 13 గురించి ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు వెలువడ్డాయి. సెప్టెంబరు లేదా అక్టోబరు నెలలో ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ ఫోన్‌కు సంబంధించిన మరింత సమాచారం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. గతేడాది విడుదల చేసిన ఐఫోన్ 12కి భిన్నంగా ఇందులో కెమెరా, ఛార్జింగ్, స్టోరేజ్ పరంగా కీలక మార్పులు చేయనున్నారట. వెనుకవైపు మూడు కెమెరాలు ఇస్తారట. అలానే వీడియోలో కూడా పొట్రెయిట్ మోడ్ తీసుకొస్తున్నట్లు సమాచారం. ఇది ఫొటోలు లేదా వీడియోలు తీసేప్పుడు కెమెరాలోని డెప్త్ సెన్సర్ ఫొటోలోని బ్యాక్‌గ్రౌండ్‌ని బ్లర్ చేసి సబ్జెక్ట్‌ని హైలెట్ చేస్తుందట. అలానే సులువుగా ఎడిట్ చేసుకునేందుకు వీలుగా హైక్వాలిటీ వీడియోలను రికార్డు చేసేందుకు ప్రో రెస్ ఫీచర్‌ను కూడా తీసుకొస్తున్నారట. వీటితోపాటు ఫొటోలో మనకు అవసరమైనచోట మాత్రమే ఉపయోగించేలా కొత్త తరహా ఫిల్టర్స్ పరిచయం చేస్తున్నట్లు తెలుస్తోంది.
దాంతో పాటు ఐఫోన్ 13లో ఎల్ఐడీఏఆర్ స్కానర్ ఉపయోగించనున్నారట. ఇప్పటి వరకు ఈ స్కానింగ్ టెక్నాలజీని కేవలం ఐఫోన్ ప్రో మోడల్స్‌లో మాత్రమే ఉపయోగించారు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఎల్‌పీవో డిస్ప్లేను డిజైన్ చేస్తున్నట్లు టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఫోన్లో యాపిల్ కొత్తగా అభివృద్ధి చేసిన ఏ15 ప్రాసెసర్ పరిచయం చేయనుందట. అలానే 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, 1టీబీ స్టోరేజ్ వంటి ఫీచర్స్ ఇస్తున్నారట. ఐఫోన్ 12ను పరిచయం చేసిన కలర్స్‌తోపాటు అదనంగా రోజ్ గోల్డ్, సన్‌సెట్ గోల్డ్ హు కలర్స్‌లో ఐఫోన్ 13ని పరిచయం చేస్తున్నట్లు సమాచారం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Technology News
Indus Royal Game: వీర్లోక్లో మిథ్‌వాకర్స్ పోరాటం.. దేనికోసం?
-
India News
SA Bobde: ‘సంస్కృతం ఎందుకు అధికార భాష కాకూడదు..?’ మాజీ సీజేఐ బోబ్డే
-
General News
‘ట్విటర్ పే చర్చా..’ ఆనంద్ మహీంద్రా, శశి థరూర్ మధ్య ఆసక్తికర సంభాషణ!
-
Politics News
JDU - RJD: జేడీయూ - ఆర్జేడీ మతలబేంటో తెలియాల్సిందే!
-
Sports News
IND vs NZ: తొలి టీ20.. సుందర్, సూర్య పోరాడినా.. టీమ్ఇండియాకు తప్పని ఓటమి
-
Technology News
WhatsApp: మూడు ఆప్షన్లతో వాట్సాప్ టెక్స్ట్ ఎడిటర్ ఫీచర్!