ఐవోఎస్‌ 15 వెర్షన్‌ను యాపిల్‌ తీసుకురానుందా..?

యాపిల్‌ సంస్థ తన ఫోన్లకు ప్రత్యేకంగా ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను తయారు చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఐవోఎస్‌ 14ను అప్‌డేట్‌ చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు టెక్‌ నిపుణులు పేర్కొన్నారు. ఐవోఎస్‌ 15 కోసం యాపిల్‌ పనిచేస్తున్నట్లు

Published : 11 Mar 2021 10:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యాపిల్‌ సంస్థ తన ఫోన్లకు ప్రత్యేకంగా ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను తయారు చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఐవోఎస్‌ 14ను అప్‌డేట్‌ చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు టెక్‌ నిపుణులు పేర్కొన్నారు. ఐవోఎస్‌ 15 కోసం యాపిల్‌ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. గూగుల్‌ ఇప్పటికే ఆండ్రాయిడ్‌ 12ను తీసుకొచ్చేసిన విషయం తెలిసిందే. ఐవోఎస్‌ 14 వెర్షన్‌కు అప్‌డేట్‌గా మరిన్ని ఫీచర్లతో ఐవోఎస్‌ 15 వెర్షన్‌ వచ్చే అవకాశం ఉంది. జూన్‌లో జరగనున్న యాపిల్ వార్షిక సమ్మిట్‌ (యాపిల్‌ వరల్డ్‌వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌)లో అధికారిక ప్రకటన విడుదల కావొచ్చని సమాచారం. వెర్షన్‌ అప్‌డేషన్‌కు సంబంధించి ఫీచర్ల గురించి వెల్లడించే అవకాశం ఉంది. గత సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా కరోనా మహమ్మారి కారణంగా ఆన్‌లైన్‌ వేదికగా సమ్మిట్‌ జరిగొచ్చు.

అంతకుముందు వెర్షన్ల కంటే ఐవోఎస్‌ 14 అప్‌డేషన్‌ సరికొత్త ఆప్షన్లతో వచ్చింది. ప్రత్యేకంగా యాప్‌ను ఓపెన్‌ చేయకుండానే హోం స్క్రీన్‌ విడ్జెట్‌లోనే సమాచారమంతా కనిపించేలా అప్‌డేట్‌ చేసింది. అయితే కొత్తగా తీసుకురాబోయే వెర్షన్‌లో యూఐ(యూజర్‌ ఇంటర్‌ఫేస్‌)లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని, ఇప్పటికే ఉన్న ఆప్షన్లను మెరుగుపరిస్తే సరిపోతుందని సాంకేతిక నిపుణులు అభిప్రాయపడ్డారు. ఐవోఎస్‌ 15 వెర్షన్‌లో యూజర్లకు ఇంటరాక్ట్ విడ్జెట్లను పరిచయం చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఉన్న వాటితో పోలిస్తే కొత్త వెర్షన్‌లో తీసుకురానున్న విడ్జెట్లు మరింత సౌకర్యంగా ఉండనున్నట్లు సమాచారం. ఐఫోన్‌ 12, ఐఫోన్‌ 11, ఐఫోన్‌ 8, ఐఫోన్ 7 సిరీస్‌ల్లోని డివైజ్‌లలో ఐవోఎస్‌ కొత్త వెర్షన్‌ అప్‌డేట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని