Axis Bank: బాండ్ల చెల్లింపులపై ఏపీ, తెలంగాణ గవర్నర్లకు యాక్సిక్‌ బ్యాంకు లేఖలు

విద్యుత్‌ బాండ్ల మెచ్యూరిటీ చెల్లింపులపై జోక్యం చేసుకోవాలని విన్నవిస్తూ ఏపీ, తెలంగాణ గవర్నర్లకు యాక్సిస్‌ బ్యాంకు లేఖలు రాసింది.

Updated : 20 Apr 2022 06:46 IST

ఇంటర్నెట్ డెస్క్‌: విద్యుత్‌ బాండ్ల మెచ్యూరిటీ చెల్లింపులపై జోక్యం చేసుకోవాలని విన్నవిస్తూ ఏపీ, తెలంగాణ గవర్నర్లకు యాక్సిస్‌ బ్యాంకు లేఖలు రాసింది. రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి బకాయి సొమ్ము ఇప్పించాలని బ్యాంకు ఇరు రాష్ట్రాల గవర్నర్లను కోరింది. 2021 సెప్టెంబర్‌ 9 నాటికి ఏపీ, తెలంగాణ ట్రాన్స్‌కోలు రూ.156.70 కోట్లు చెల్లించాల్సి ఉందని లేఖలో తెలిపింది. డిబెంచర్‌ ట్రస్టీ హోదాలో లేఖ రాస్తున్నట్లు యాక్సిక్‌ బ్యాంకు వెల్లడించింది. కాలపరిమితి ముగిసిన బాండ్ల చెల్లింపులపై ఇరు రాష్ట్రాల ట్రాన్స్‌కోలు స్పందించట్లేదని పేర్కొంది. 2006లో రెండు దఫాలుగా రూ.40.50 కోట్లు, రూ.159.50 కోట్ల విద్యుత్‌ బాండ్లు జారీ చేసినట్లు, బాండ్ల కాలపరిమితి ముగిసినా ఏపీ ట్రాన్స్‌కో స్పందించలేదని పేర్కొంది. పలుమార్లు సంప్రదింపుల తర్వాత రూ.121 కోట్లు విడుదల చేసినట్లు తెలిపింది. బకాయిపడిన రూ.36.70 కోట్లు ఇంకా విడుదల కాలేదని లేఖలో వెల్లడించింది. ఏపీ ట్రాన్స్‌కో విద్యుత్‌ బాండ్లకు ఏపీ ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిందని తెలిపింది. 

Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని