Updated : 28 Mar 2022 05:26 IST

Crime News: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...9కి చేరిన మృతులు

తిరుపతి: చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది. మదనపల్లె - తిరుపతి జాతీయ రహదారిపై భాకరాపేట కనుమలోని భారీ మలుపు వద్ద శనివారం రాత్రి ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందగా,  54 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు సాయంత్రం నాగలక్ష్మి మృతి చెందింది. దీంతో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. అనంతపురం జిల్లా ధర్మవరంలోని రాజేంద్రనగర్‌కు చెందిన వేణుకు చిత్తూరు జిల్లా నారాయణవనం ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఆదివారం ఉదయం తిరుచానూరులో నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వేణు కుటుంబం ధర్మవరం నుంచి తిరుచానూరు వెళ్తుండగా.. భాకరాపేట సమీపంలో బస్సు లోయలో పడిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. రాత్రి మృతి చెందిన 8మంది అంత్యక్రియలు ఇవాళ మధ్యాహ్నం దర్మవరంలో నిర్వహించారు.

Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని