ఆడుకుందామూ.. మారాం చేసిన మార్జాలం

మీరు సీరియస్‌గా ఓ పుస్తకం చదువుతున్నారు.. ఆ సమయంలో ఎవరైనా ఆపితే ఎంతో కోపం వస్తుంది. అలాగే డిస్టర్బ్‌ చేస్తుంటే...

Updated : 18 Nov 2020 06:49 IST

పుస్తకంలోకి తల దూర్చి గారం పోయిన పెంపుడు పిల్లి
నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో

ఇంటర్నెట్‌ డెస్క్: మీరు సీరియస్‌గా ఓ పుస్తకం చదువుతున్నారు.. ఆ సమయంలో ఎవరైనా ఆపితే ఎంతో కోపం వస్తుంది. అలాగే డిస్టర్బ్‌ చేస్తుంటే వారితో వాదనకూ దిగుతాం. అదే మీ పెంపుడు పిల్లి గోముగా పుస్తకంలోకి తలను దూర్చి అలానే చూస్తుంటే.. దీనికి సంబంధించిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లను ఆకట్టుకుంది. ‘నేను చదువుతున్నప్పుడు అందమైన పెద్ద కళ్లు నన్ను అడ్డుకున్నాయి’ అని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన నెటిజన్‌ పేర్కొన్నారు. ‘సో క్యూట్‌నెస్‌. సూపర్‌. అద్భుతం’ అని ప్రతిస్పందనలు వచ్చాయి. ‘మీ దృష్టి పిల్లులపై పడాలని ఏదో ఒకటి చేస్తుంటాయి’, ‘పుస్తకం పక్కన పెట్టి నాతో ఆడుకోవోయ్‌.. పద బయటకు పోదాం’ అంటూ చెబుతున్నట్లు ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 


Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని