Published : 21 Jan 2022 19:33 IST

David warner: తగ్గేదేలే అంటోన్న వార్నర్‌.. ఈసారి ‘శ్రీవల్లి’ సాంగ్‌కు స్టెప్పులు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: మైదానంలో అడుగుపెట్టాడంటే రెచ్చిపోయే ఆసీస్‌ బ్యాటర్‌, సన్‌రైజర్స్‌ మాజీ కెప్టెన్ డేవిడ్‌ వార్నర్‌ సోషల్‌ మీడియాలోనూ తగ్గేదేలే అంటున్నాడు. తాజాగా అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప’ సినిమాలో మరో పాటకు స్టెప్పులేసి అభిమానుల్ని ఫిదా చేశాడు. శ్రీవల్లి సాంగ్‌కు డేవిడ్‌ వేసిన స్టెప్పుల వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటలో అచ్చంగా అల్లు అర్జున్‌ను గుర్తుకు తెచ్చేలా (చెప్పు కాలి నుంచి జారిపడిన స్టెప్పుతో సహా) డేవిడ్‌ వేసిన స్టెప్పు అదిరిపోయింది. ‘పుష్పా.. వాట్‌ నెక్స్ట్’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాలో డేవిడ్‌ పోస్ట్‌ చేసిన ఈ వీడియోను మూడు గంటల వ్యవధిలోనే దాదాపు 8.8 లక్షల మందికి పైగా వీక్షించారు. నెటిజన్లు వార్నర్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అలాగే, తన పాటకు వార్నర్‌ డ్యాన్స్‌ చేయడంపై ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ కూడా స్పందించారు. నవ్వుతూ.. ఫైర్‌ ఎమోజీలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు.

గతంలో కరోనా సమయంలో క్రికెట్‌ ఆడలేకపోయిన ఈ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌.. తన భార్యతో కలిసి చేసిన టిక్‌టాక్‌ వీడియోలతో భలేగా ఫేమస్ అయిపోయాడు. అల్లు అర్జున్‌ ‘అల వైకుంఠపురం’లో క్యాండీ వార్నర్‌తో కలిసి ‘బుట్టబొమ్మ’.. మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరూ’లో మైండ్‌ బ్లాక్‌ పాటలకు స్టెప్పులేసి తనలోని మరో కోణాన్ని బయటకు తీసిన వార్నర్‌.. ఆ తర్వాత వరుసగా క్రికెట్‌ మ్యాచ్‌లతో బిజీ అయిపోయాడు. మళ్లీ ఇటీవల అల్లు అర్జున్‌ ‘పుష్ప’లోని యే బిడ్దా.. ఇది నా అడ్డా..’ పాటను ఇమిటేట్ చేస్తూ విడుదల చేసిన వీడియోతో అలరించిన విషయం తెలిసిందే.



Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని