MCC: పరిహాసానికి కూడా అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు: ఆండ్రూ స్ట్రాస్‌

ఇంగ్లాండ్‌ను అద్భుతంగా నడిపిన సారథుల్లో ఆండ్రూ స్ట్రాస్‌ ఒకడు. ఈ క్రమంలో భవిష్యత్‌ తరం క్రికెటర్లకు కీలక సూచనలు చేశాడు. క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఆడాలని పేర్కొన్నాడు.

Published : 04 Feb 2023 01:48 IST

ఇంటర్నెట్ డెస్క్‌: డ్రెస్సింగ్‌ రూమ్‌లో జాతి వివక్ష వేధింపులు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్‌ అభిప్రాయపడ్డాడు. గతంలో ఆజీమ్‌ రఫీఖ్ సంఘటన బయటకు రావడంతో పెద్ద దుమారమే రేగిన విషయం తెలిసిందే. మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్‌ (MCC) తరఫున స్ట్రాస్‌ ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను వెల్లడించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆటగాళ్లను వ్యక్తిగతంగా పరిహాసం చేయొద్దని సూచించాడు.

‘‘వేర్వేరుగా ప్రాంతాల నుంచి విభిన్నమైన ఆటగాళ్లు క్రికెట్‌ను ఆడేందుకు వస్తుంటారు. వారితో కలిసి ఆడాల్సి ఉంటుంది. డ్రెస్సింగ్‌ రూమ్‌ను పంచుకొంటూ ఉంటారు. అలాంటి సమయంలో పరిహాసానికి కఠిన పదాలను వాడొద్దు. వారి సంప్రదాయాలకు విరుద్ధంగా ఉండే అవకాశం ఉంది. అలాంటి వాటికి స్థానం కల్పించొద్దు. సహనంతో అర్థం చేసుకోవాలి. ఇప్పుడున్న ఆటగాళ్లకు క్రీడా స్ఫూర్తి చాలా అవసరం. మరీ ముఖ్యంగా పురుషుల క్రికెట్‌ గురించే మాట్లాడుతున్నా. నిరంతరం మీడియా నిఘా ప్రతి ఒక్కరిపై ఉంటుంది’’ అని స్ట్రాస్‌ తెలిపాడు. 

బ్రెండన్ మెక్‌కల్లమ్‌, బెన్‌ స్టోక్స్‌ కలిసి ఇంగ్లాండ్‌ టెస్టు క్రికెట్‌ను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారని స్ట్రాస్‌ ప్రశంసించాడు. వీరిద్దరూ కలిసి 10 టెస్టుల్లో తొమ్మిది టెస్టులను ఇంగ్లాండ్‌ను గెలిపించారు. ‘‘బ్రెండన్, బెన్ స్టోక్స్‌ గతేడాది నుంచి టెస్టు గేమ్‌ను మరింత రసవత్తరంగా మార్చారు. గతంలో ఉండే టెస్టు ఫార్మాట్‌కు భిన్నంగా దూకుడైన ఆటతీరును ప్రదర్శించారు. అలాగే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌ల ప్రభంజనం క్రికెట్‌కు ఎంతో ఉపయోగకరం’’ అని స్ట్రాస్‌ చెప్పాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు