సండే టిప్‌: ఐక్లౌడ్‌ TO గూగుల్‌ ఫొటోస్‌.. ఎలాగంటే?

ఫొటోలను షేర్‌, స్టోర్‌ చేసుకునేందుకు గూగుల్‌ ఫొటోస్ ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఐవోఎస్‌..

Published : 07 Mar 2021 17:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫొటోలను షేర్‌, స్టోర్‌ చేసుకునేందుకు గూగుల్‌ ఫొటోస్(google photos) ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఐవోఎస్‌ యూజర్ల కోసం ఐ క్లౌడ్‌ ఫొటోస్‌(icloud photos)ను యాపిల్‌ సంస్థ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఐ క్లౌడ్‌ ఫొటోస్‌ నుంచి గూగుల్ ఫొటోస్‌కు ఫైల్స్‌ను, ఇమేజ్‌లు, వీడియోలను ట్రాన్స్‌ఫర్ చేసుకునేందుకు యాపిల్‌ అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఇలాంటి అవకాశం ఆస్ట్రేలియా, కెనడా, యూరప్, ఐస్‌ల్యాండ్‌, న్యూజిలాండ్‌, నార్వే, యూకే, యూఎస్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే భారత్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తామని యాపిల్‌ వెల్లడించింది. మరి ఐక్లౌడ్‌ ఫొటోస్‌ నుంచి గూగుల్‌ ఫొటోస్‌కు ఫైల్స్‌ను ఎలా పంపించవచ్చో తెలుసుకుందాం..

యాపిల్ ఐ క్లౌడ్‌ ఫొటోస్‌ నుంచి గూగుల్ ఫొటోస్‌కు ఫైల్స్‌ను ట్రాన్స్‌ఫర్ అవ్వాలంటే దాదాపు మూడు రోజుల నుంచి ఏడు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. యూజర్ రిక్వెస్ట్‌ను వెరిఫై చేసేందుకే ఈ సమయం తీసుకుంటుంది. ఫొటోలు, వీడియోలు వంటివాటి బదిలీకి అనుమతి ఉన్నప్పటికీ.. కొన్ని ఫార్మాట్‌లో ఉండే ఇమేజ్‌లు, స్మార్ట్‌ ఆల్బమ్స్‌ను ఒరిజినల్‌గా ట్రాన్స్‌ఫర్‌ చేసుకునేందుకు వీలుండదు. ఐ క్లౌడ్‌ ఫొటోస్‌ నుంచి ట్రాన్స్‌ఫర్ చేసిన ఇమేజ్‌లు, ఫైల్స్ డిలీట్‌ కావని యాపిల్‌ పేర్కొంది. ఐ క్లౌడ్‌ ఫొటోస్‌లో స్పేస్‌ కావాలంటే మాత్రం ఫైల్స్‌ ట్రాన్స్‌ఫర్ అయ్యాక వాటిని మాన్యువల్‌గా తీసేసుకోవాల్సిందే.

ఎలా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలంటే...

* ప్రైవసీ.యాపిల్‌.కమ్ ఓపెన్‌ చేసి యాపిల్‌ ఐడీతో లాగిన్‌ అవ్వాలి.

* ‘ట్రాన్స్‌ఫర్‌ ఏ కాపీ ఆఫ్‌ యువర్‌ డేటా’ను ఎంచుకోవాలి.

* ఐ క్లౌడ్‌ ఫొటోస్‌ను ఎంచుకుని డెస్టినేషన్‌గా గూగుల్‌ ఫొటోస్‌ను సెలెక్ట్‌ చేయాలి.

* గూగుల్ అకౌంట్‌ సైన్‌ఇన్‌ అయిన తర్వాత ఫైల్స్‌ ట్రాన్స్‌ఫర్ ప్రారంభమవుతుంది.

* ఫైల్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేసేముందు గూగుల్‌ ఫొటోస్‌లో స్టోరేజ్‌ ఖాళీ ఎంత ఉందో చెక్‌ చేసుకోవాలి.

Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని