
IPL 2022: మేం ఎవరినీ కాపీ కొట్టదల్చుకోలేదు..: గంభీర్
ఇంటర్నెట్‌డెస్క్: యువ మణికట్టు స్పిన్నర్ రవిబిష్ణోయ్ కచ్చితంగా వికెట్లు తీసే బౌలర్ అని మాజీ బ్యాట్స్‌మన్ గౌతమ్ గంభీర్ కొనియాడాడు. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2022కు సంబంధించిన మెగా వేలం జరగనున్న నేపథ్యంలో కొత్త ఫ్రాంఛైజీ లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ప్రణాళికలపై ఆ జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ ఓ యూట్యూబ్ ఛానల్ల్లో మాట్లాడాడు. ఈ సందర్భంగా రవిబిష్ణోయ్ బౌలింగ్‌పై ప్రశంసలు కురిపించాడు.
‘అతడో యువ క్రికెటర్, ప్రతిభావంతుడు, వికెట్ టేకర్. కచ్చితంగా తుది జట్టులో ఉండే ఆటగాడు. ఆటలో ఏ సమయంలోనైనా బౌలింగ్ చేయగల సమర్థుడు. ఇలా ఏ విధంగా చూసినా అతడు మా జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగేందుకు పూర్తి అర్హుడైన ఆటగాడు. దీంతో భవిష్యత్‌లో మేం అతడిని మరింత ఉన్నతమైన స్పిన్నర్‌గా తీర్చిదిద్దాలని చూస్తున్నాం. ఇప్పుడున్న లెగ్ స్పిన్నర్లలో అతడే పిన్న వయస్కుడు. అది మాత్రమే కాకుండా అతడే అత్యుత్తమైన బౌలర్ కూడా. ఈ నేపథ్యంలో రవి గురించి మా వద్ద స్పష్టమైన దీర్ఘకాల ప్రణాళికలు ఉన్నాయి’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
అలాగే లఖ్‌నవూ జట్టు ప్రణాళికలపై స్పందించిన కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ సారథి.. ‘ఇంతకుముందెన్నడూ రూపొందించని విధంగా కొత్త జట్టును తీర్చిదిద్దడం గొప్ప అవకాశం. ఈ విషయంలో మేం ఎవరినీ కాపీ కొట్టదల్చుకోలేదు. మా ప్రణాళికలు మాకున్నాయి. మా ప్రత్యేకత మాకు ఉండాలి కూడా. ఇంతకుముందు సంజీవ్ గోయెంకా.. పుణె జట్టును సొంతం చేసుకున్నప్పుడు ఒక్క పరుగుతో టైటిల్ దూరమైంది. అప్పుడు సాధ్యం కానిది ఇప్పుడు ప్రయత్నించడమనేది గొప్ప ఛాలెంజ్. అయితే, ఒక్క సీజన్లోనే అంతా జరిగిపోతుందని నేను చెప్పలేను. అది సుదీర్ఘకాల ప్రక్రియ. ఈ ఒక్క ఏడాది కోసమే మేం జట్టును తయారుచేయాలనుకోవట్లేదు. భవిష్యత్‌పైనా మంచి ఆలోచనలు ఉన్నాయి’ అని గంభీర్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.