అన్ని మెసెంజర్లు ఒకే దాంట్లో!
ఎవరి ఫోన్లో చూసినా ఒకటి లేదా రెండు మెసెంజర్లు తప్పనిసరి. ఇప్పుడున్న ప్రైవసీ గోప్యత నేపథ్యంలో ఏది సరైంది అనిపిస్తే దాన్ని వాడేస్తున్నారు. ఎందుకిలా ఒక్కొక్కటి వాడడం అన్నింటినీ ఒకే దాంట్లో యాక్సెస్ ..
ఎవరి ఫోన్లో చూసినా ఒకటి లేదా రెండు మెసెంజర్లు తప్పనిసరి. ఇప్పుడున్న ప్రైవసీ గోప్యత నేపథ్యంలో ఏది సరైంది అనిపిస్తే దాన్ని వాడేస్తున్నారు. ఎందుకిలా ఒక్కొక్కటి వాడడం అన్నింటినీ ఒకే దాంట్లో యాక్సెస్ చేస్తే బాగుంటుంది కదా! అని అనిపిస్తే ‘బీపర్’ యాప్‌ని వాడేయొచ్చు. ఇది వాట్సాప్, సిగ్నల్, టెలిగ్రామ్, ట్విట్టర్, స్లాక్.. ఇలా నెట్టింట్లో ఆదరణ పొందిన ఇంచుమించు అన్ని మెసెంజర్లను సపోర్టు చేస్తుంది. సుమారు 15 రకాల మెసెంజర్లను దీంట్లో సింక్ చేసుకుని వాడుకోవచ్చు. దీంట్లోని మరో ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇప్పటి వరకూ యాపిల్ ఫోన్ల్లో మాత్రమే యాక్సెస్ చేసిన ‘ఐమెసేజ్’లను కూడా ఆండ్రాయిడ్‌లో చూడొచ్చు. గతంతో ఇది ‘నోవాఛాట్’ పేరుతో ఉండేది. ఇప్పుడు పేరు మార్చేసి ఆండ్రాయిడ్, విండోస్, లినక్స్ ఓఎస్‌ల్లో వాడుకునేలా తీర్చిదిద్దారు. కాకపోతే.. ఇది ఉచితంగా కాదండోయ్. నెలకు సుమారు రూ.730 ఖర్చే చేయాలి. అంటే.. ఇది ప్రీమియం సర్వీసు అన్నమాట! అయినా వాడేద్దాం అనుకుంటే ఓ లుక్కేయండి.
వివో హై ఎండ్ ఫోన్లు
మార్కెట్లోకి కొత్తగా వచ్చే ఫోన్లలో ఎక్కువ శాతం పంచ్‌హోల్ సెల్ఫీ కెమెరాలు.. ఫాస్ట్ ఛార్జింగ్ ప్రత్యేకంగా నిలుస్తున్నాయ్. ఇదే కోవలో మరో సరికొత్త మోడళ్లని వివో మార్కెట్లోకి తెచ్చింది. ‘ఎక్స్60 ప్రో ప్లస్’ పేరుతో విడుదల చేసింది. స్నాప్‌డ్రాగన్ 888ఎస్ఓసీ ప్రాసెసర్‌ని వాడారు. 55వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో ఛార్జ్ అవుతుంది. తెర పరిమాణం 6.56 అంగుళాలు. వెనక నాలుగు కెమెరాల సెట్అప్ ఉంది. ఆ నాలుగంటిలో రెండు ‘ప్రైమరీ’ కెమెరాలుగా (సోనీ లెన్స్, శామ్సంగ్ లెన్స్) పని చేస్తాయి. వీటి సామర్థ్యం 48ఎంపీ, 50ఎంపీ. ముందు పంచ్హోల్తో సెల్ఫీ కెమెరాని ఏర్పాటు చేశారు. 12జీబీ వరకూ ర్యామ్ సపోర్టు ఉంది. ఇంటర్నల్ స్టోరేజ్ 256జీబీ. బ్యాటరీ సామర్థ్యం 4,200ఎంఏహెచ్. అంచనా ధర రూ.67,800.
డెస్క్‌టాప్ నుంచే వాట్సాప్ కాల్స్
గత కొన్ని నెలలుగా ఊరిస్తున్న వాట్సాప్ డెస్క్‌టాప్ వీడియో, వాయిస్ కాల్స్ సదుపాయం బీటా వెర్షన్ రూపంలో పలకరించేందుకు సిద్ధం అయ్యింది. అప్డేటెడ్ విండోస్ 10 ఓఎస్‌తో వాడుతున్న కొందరి డెస్క్టాప్ల్లో బీటా వెర్షన్‌గా ఆప్షన్ కనిపిస్తోంది. 2021లో ఈ ఫీచర్‌ని పరిచయం చేస్తామని మాట ఇచ్చినట్టుగానే వాట్సాప్ డెస్క్‌టాప్ యూజర్లను పలకరిస్తోంది. మరికొద్ది నెలల్లోనే అందరి పీసీల్లోనూ ప్రత్యక్షం కానుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
India News
Modi: ఆ దశాబ్ద కాలాన్ని మనం కోల్పోయాం.. విపక్షాలపై మోదీ ఫైర్
-
General News
Hyderabad: వాహనదారులకు అలర్ట్.. ట్రాఫిక్ పద్మవ్యూహంలో ఖైరతాబాద్ కూడలి
-
World News
Turkeys earthquake: తుర్కియేలో భూకంప పన్ను ఏమైంది..? ప్రజల ఆగ్రహం..!
-
Politics News
Harish Rao: భాజపా ‘అమృత్కాల్’.. దేశ ప్రజలకు ఆపద కాలం: హరీశ్‌రావు
-
Politics News
Rahul Gandhi: మోదీపై ఆరోపణలు.. రాహుల్ గాంధీపై చర్యలకు భాజపా డిమాండ్..!