TS Lockdown: అంతర్రాష్ట్ర సర్వీసులు నడవవు

రాష్ట్ర మంత్రిమండలి ఆదేశాల మేరకు తెలంగాణలో లాక్‌డౌన్‌ పొడిగింపుపై ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం

Updated : 31 May 2021 07:00 IST

50 శాతం సిబ్బందితో ఒంటి గంట వరకు ప్రభుత్వ కార్యాలయాలు
స్లాట్‌ బుకింగ్‌తో రిజిస్ట్రేషన్లు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రిమండలి ఆదేశాల మేరకు తెలంగాణలో లాక్‌డౌన్‌ పొడిగింపుపై ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు అన్ని రకాల ప్రజారవాణాకు అనుమతించిన ప్రభుత్వం.. అంతర్రాష్ట్ర సర్వీసులను రద్దు చేసింది. అత్యవసర సేవలు మినహా ఇతర విభాగాల్లో 50 శాతం సిబ్బందితో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే ప్రభుత్వ కార్యాలయాలు పని చేయనున్నాయి. జాతీయ రహదారులపై ఉన్న పెట్రోల్‌ బంకులు మినహా.. మిగతావి మధ్యాహ్నం ఒంటి గంట వరకే తెరచి ఉంటాయి.
భూ క్రయవిక్రయదారులకు పాసులు
రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభం కానున్న భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం  మార్గదర్శకాలు జారీ చేసింది. ఉదయం 9 గంటల నుంచి ఒంటి గంట వరకు కార్యాలయాలు పనిచేయనున్నాయి. రిజిస్ట్రేషన్‌కు వచ్చే భూ యజమానులు, ఇద్దరు సాక్షులకు ప్రత్యేకంగా ఆన్‌లైన్‌ ద్వారా పాస్‌లు జారీచేయనున్నారు.మరోవైపు తహసీల్దారు కార్యాలయాల ద్వారా నిర్వహిస్తున్న ధరణి పోర్టల్‌ రిజిస్ట్రేషన్లపై స్పష్టంగా ఉత్తర్వులేవీ విడుదలకానప్పటికీ జిల్లాల కలెక్టర్లు ప్రక్రియ ప్రారంభించాలని తహసీల్దార్లకు ఉత్తర్వులు జారీ చేశారు.  
31వ తేదీ సోమవారం నుంచి మీసేవా, ఆన్‌లైన్‌ కేంద్రాల ద్వారా భూముల రిజిస్ట్రేషన్‌కు స్లాట్లు నమోదు చేసుకోవచ్చు. సబ్‌ రిజిస్ట్రారు స్థాయిలో 24 స్లాట్లు, జిల్లా రిజిస్ట్రారు స్థాయిలో 48 స్లాట్లకు రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయనున్నారు.
రిజిస్ట్రారు కార్యాలయంలోకి ఏడుగురిని మాత్రమే అనుమతిస్తారు. ఎన్‌కంబర్స్‌మెంట్‌ ధ్రువీకరణ పత్రాలను (ఈసీ) తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కార్యాలయాల ద్వారా జారీ చేయొద్దని ఆ శాఖ అధికారులను ఆదేశించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు