
Updated : 18 Jan 2022 07:07 IST
AP News: నేటి నుంచి ఏపీలో రాత్రి కర్ఫ్యూ అమలు
రాత్రి 11 నుంచి ఉ. 5 గంటల వరకూ
ఈనాడు, అమరావతి: ఏపీలో మంగళవారం రాత్రి నుంచి కర్ఫ్యూ నిబంధనలు అమలులోకి రానున్నాయి. 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ అమలుచేయనున్నారు. వివాహాలు, మతపరమైన, సామాజిక కార్యక్రమాలను బహిరంగ ప్రదేశాల్లో నిర్వహిస్తే గరిష్ఠంగా 200 మంది, హాళ్లలో అయితే 100 మందే హాజరుకావాలి. అంతర్రాష్ట్ర, రాష్ట్ర సరకు రవాణా వాహనాలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంది.
4,108 మందికి పాజిటివ్..
ఏపీలో ఆదివారం ఉదయం 9 నుంచి సోమవారం ఉదయం 9 గంటల మధ్య 22,882 నమూనాలను పరీక్షించగా... 4,108 కేసులు బయటపడ్డాయి. దీంతో పాజిటివిటీ రేటు 17.95%గా నమోదైంది. ఈ నెల 1న పాజిటివిటీ రేటు 0.57%గా నమోదైంది.
Tags :