Updated : 18 Jan 2022 09:15 IST

AP News: తెరపైకి సచివాలయాల ఉద్యోగుల కొత్త సంఘాలు

ప్రస్తుత సంఘాలకు చెక్‌ పెట్టే ప్రయత్నమా?

ఈనాడు-అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులంతా కొత్తగా మండల స్థాయిలో ఉద్యోగ సంఘాలను ఎన్నుకుంటున్నారు. సహచర ఉద్యోగులు తమ మాట వినడం లేదని అంటున్న సంఘాల నాయకులను తమ సమావేశానికి ఇకనుంచి ఆహ్వానించేది లేదని గ్రామ, వార్డు సచివాలయాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌ ఇటీవల వ్యాఖ్యానించారు. ఇదే క్రమంలో సచివాలయాల ఉద్యోగులతో మండల సంఘాల ఏర్పాటుకు ప్రాధాన్యమేర్పడింది. అత్యధిక జిల్లాల్లో ఇప్పటికే మండల సంఘాలు ఏర్పడ్డాయి. ప్రస్తుత సంఘాలకు చెక్‌ పెట్టే క్రమంలో వీటిని తెరపైకి తెస్తున్నారా? అనేది చర్చనీయాంశమవుతోంది. ప్రొబేషన్‌ ఖరారుకు ఉద్యోగులు ఇటీవల ఆందోళన చేశారు. వారితో చర్చించేందుకు అజయ్‌జైన్‌ నిర్వహించిన సమావేశానికి సచివాలయాల ఉద్యోగుల సంఘాల తరఫున 20మందికిపైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఆందోళన వీడాలని ఉన్నతాధికారి సూచించినప్పుడు ఉద్యోగ సంఘాల నేతలు కొందరు విభేదించారు. సమస్యలు పరిష్కరించేవరకు సహచరులు మాట వినే పరిస్థితుల్లో లేరని వారు పేర్కొనడంపై అజయ్‌జైన్‌ ఆగ్రహించారు. ఈ సమావేశం ముగిసిన 10రోజుల్లో మండలస్థాయిలో ఉద్యోగ సంఘాలు ఏర్పాటుకావడం చర్చకు దారి తీస్తోంది.

Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని