
AP News: తింగరి వేషాలు వేస్తే ప్రతిపాదనలు ఆగిపోతాయి: మంత్రి సీదిరి
పలాస, న్యూస్టుడే: తెదేపా సర్పంచులు తింగరి వేషాలు వేస్తే ప్రతిపాదనలు ఎంపీడీఓ కార్యాలయాల్లోనే ఉండిపోతాయని రాష్ట్ర పశుసంవర్థక, పాడి, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు. పలాసలో ఉపాధిహామీ పథకంపై మంగళవారం జరిగిన నియోజకవర్గ సమీక్షలో ఆయన మాట్లాడారు. ‘అభివృద్ధిలో మనం ముందుండాలి. పంచాయతీల్లో ప్రతిపాదనలు పెట్టించండి.. ఒకటి రెండు చోట్ల తెదేపా సర్పంచులున్నారు... వారికి మంత్రిగారు ఇలా చెప్పారని చెప్పండి’ అని ఆయన అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.