Updated : 27 Jan 2022 07:00 IST

Covid Vaccine: కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ ధర రూ.275!

మరో రూ.150 సర్వీస్‌ ఛార్జీలు

దిల్లీ: త్వరలో బహిరంగ విపణి ఆమోదం పొందనున్న కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ ఒక్కో డోసు ధర రూ.275 వరకు ఉండొచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. సర్వీస్‌ ఛార్జీల రూపంలో మరో రూ.150 అదనంగా వసూలు చేసే అవకాశం ఉంది. ఈ మేరకు ధర నిర్ణయంపై నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ(ఎన్‌పీపీఏ) కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవాగ్జిన్‌ రూ.1200కు, కొవిషీల్డ్‌ రూ.780కు లభిస్తోంది. ఈ రెండు టీకాలకు గత ఏడాది జనవరి 3న అత్యవసర వినియోగ అనుమతులు లభించాయి. అయితే గత ఏడాది అక్టోబర్‌ 25న కొవిషీల్డ్‌ను అభివృద్ధి చేసిన సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సంస్థలు బహిరంగ విపణిలో విక్రయించుకునేందుకు అనుమతి కోరుతూ డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ)కు దరఖాస్తు చేసుకుంది. కొన్ని వారాల క్రితం భారత్‌ బయోటెక్‌ సంస్థ కూడా తమ టీకా కొవాగ్జిన్‌కు ఇదే తరహా అనుమతివ్వాలంటూ సంబంధిత పత్రాలను డీసీజీఐకు సమర్పించింది. ఈ నెల 19న కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థలోని కొవిడ్‌-19 నిపుణుల కమిటీ కూడా ఈ దరఖాస్తులపై సానుకూలంగా స్పందించింది. షరతులతో కూడిన అనుమతులివ్వొచ్చని సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో ధర నిర్ణయంపై కసరత్తు జరుగుతోందని ఓ అధికారి తెలిపారు.

Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని