Updated : 29 Jan 2022 07:48 IST

Australia Open: నువ్వు దద్దమ్మవా..? అంపైర్‌పై మెద్వెదెవ్‌ చిందులు

ఇంటర్నెట్‌డెస్క్‌: మెద్వెదెవ్‌కు కోపమొచ్చింది. సిట్సిపాస్‌తో సెమీఫైనల్‌ సందర్భంగా అతను చైర్‌ అంపైర్‌ కాంపిస్టోల్‌పై చిందులు తొక్కాడు. స్టాండ్స్‌లో ఉన్న సిట్సిపాస్‌ తండ్రి కొడుక్కి నిబంధనలకు విరుద్ధంగా సూచనలు ఇస్తుండటం, ఎంతకీ అంపైర్‌ స్పందించకపోవడంతో అతను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. విరామ సమయంలో కుర్చీలో కూర్చుని ఉన్న అంపైర్‌ వైపు కోపంగా చూస్తూ.. ‘‘నువ్వేమైనా దద్దమ్మవా? అతడికి తండ్రి శిక్షణ ఇస్తుంటే నీకు కనిపించడం లేదా? నా ప్రశ్నకు జవాబు చెప్పు’’ అంటూ అరిచాడు. అతడికేదో సర్ది చెప్పి.. అంపైర్‌ తల పక్కకు తిప్పగా.. ‘‘నేను నీతో మాట్లాడుతున్నాను. నా ప్రశ్నకు జవాబు చెప్పు’’ అంటూ మెద్వెదెవ్‌ ఆగ్రహంతో ఊగిపోయాడు. మ్యాచ్‌ పూర్తయ్యాక కూడా అంపైర్‌ను కోపంగా ఏదో అనేసి వెళ్లాడతను.

Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని