
UP Election 2022:ఒకే స్థానంలో నామినేషన్లు వేసిన ఆజంఖాన్ భార్య, కుమారుడు!
నొయిడా: ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎంపీ ఆజంఖాన్ కుమారుడు మహమ్మద్ అబ్దుల్లా, భార్య తనీజ్ ఫత్మాలు రామ్‌పుర్ జిల్లా సువార్ అసెంబ్లీ స్థానం నుంచి ఎస్పీ అభ్యర్థులుగా శుక్రవారం తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఫోర్జరీ, భూఆక్రమణ కేసులో ఆజంఖాన్, ఆయన భార్య, కుమారుడిపై 2020లో ఆరోపణలు వచ్చాయి. దీంతో వారు అప్పట్లో రామ్‌పుర్ కోర్టులో లొంగిపోయారు. ఫత్మాకు అదే ఏడాది బెయిల్ రాగా, అబ్దుల్లా ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యారు. ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆజంఖాన్ ఇంకా జైలులోనే ఉన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.