AP PRC: పీఆర్సీ జీవోల్లో ఉన్నవి.. ఇప్పుడు జరిగిన నిర్ణయాలివీ..
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కొత్త వేతన సవరణకు సంబంధించి ప్రభుత్వం కొన్ని సవరణలకు అంగీకరించింది. 2022 పీఆర్సీ అమలుకు సంబంధించి జనవరి 17న వెలువరించిన ఉత్తర్వుల విషయంలో అసంతృప్తి రేగడంతో మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించి శనివారం రాత్రి తాజా ప్రకటన చేసింది. ఇంతకుముందు వెలువరించిన నిర్ణయాలు కొన్నింటిలో మార్పులు చేసింది. వీటిలో కొన్నింటి అమలు 2022 జనవరి నుంచి అని పేర్కొంది. మరికొన్ని నిర్ణయాల అమలు ఎప్పటి నుంచి అన్నది స్పష్టం చేయలేదు. విడుదలయ్యే జీవోల్లోనే స్పష్టత రావాల్సి ఉంటుంది. కొత్త పీఆర్సీకి సంబంధించి 2022 జనవరి 17న వెలువరించిన జీవోలోని అంశాలకు, తాజాగా ప్రభుత్వం శనివారం ప్రకటించిన వాటిలో మార్పులు ఏమిటి అన్నది పరిశీలిద్దాం...
2022 జనవరి 17 జీవోల ప్రకారం...
1. ఫిట్మెంట్ 23 శాతం
2. ఐఆర్ 27 శాతం రికవరీ (సర్దుబాటు)
3. హెచ్ ఆర్ ఏ శ్లాబులు ఇలా...
* 5 లక్షలలోపు జనాభా ఉంటే మూలవేతనంపై 8శాతం
* 5 నుంచి 50 లక్షల జనాభా ఉంటే 16శాతం
* 50 లక్షలకు పైగా జనాభా ఉంటే 24శాతం
4. సీసీఏ పూర్తిగా తొలగింపు
5 కేంద్ర ప్రభుత్వం ప్రకారం పదేళ్లకు ఒకసారి వేతన సవరణ కమిషన్
6. అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్
* 80 ఏళ్ల నుంచి మూల పెన్షన్‌పై 20శాతం అదనం
* 85 ఏళ్ల నుంచి 30శాతం అదనం
* 90 ఏళ్ల నుంచి 40 శాతం అదనం
* 95 ఏళ్ల నుంచి 50 శాతం అదనం
* 100 ఏళ్ల నుంచి మూల పెన్షన్‌పై 100శాతం అదనం
7. మట్టి ఖర్చులు గరిష్ఠంగా రూ.20 వేలు
2022 ఫిబ్రవరి 5 రాత్రి నిర్ణయాల ప్రకారం....
1. ఫిట్మెంట్లో మార్పు లేదు
2. ఐఆర్ 27 శాతం 9 నెలలకు సంబంధించి రికవరీ ఉండబోదు
3. హెచ్ ఆర్ ఏ శ్లాబులు ఇలా...
* 50 వేలలోపు జనాభా ఉంటే మూలవేతనంపై 10శాతం లేదా గరిష్ఠంగా 11వేలు
* 50 వేల నుంచి 2లక్షల జనాభా వరకు 12శాతం లేదా గరిష్ఠంగా 13 వేలు
* 2 లక్షల నుంచి 50 లక్షల వరకు 16శాతం లేదా గరిష్ఠంగా రూ.17 వేలు
* 50 లక్షలకు మించి ఉంటే మూలవేతనంపై 24శాతం, గరిష్ఠంగా రూ.25వేలు
* సచివాలయాలు, విభాగాధిపతి కార్యాలయాల ఉద్యోగులకు 24శాతం 2024 జూన్ వరకు.
4. సీసీఏ పాతవి పునరుద్ధరణ
5. గతంలో ఉన్న పద్ధతిలోనే 5 ఏళ్లకు ఒకసారి పీఆర్సీ కమిషన్ ఏర్పాటు
6. అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్
* 70 ఏళ్ల నుంచి 74 ఏళ్ల వరకు 7 శాతం
* 75 నుంచి 79 ఏళ్ల వరకు 12శాతం ,
* 80 ఏళ్ల నుంచి ఆ పైబడి
జనవరి 17 నాటి జీవోలో పేర్కొన్నవే కొనసాగింపు..
7.మట్టి ఖర్చులు రూ.25 వేలు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Kolkata: బికినీ ధరించిన ప్రొఫెసర్.. రూ.99కోట్లు కట్టాలంటూ యూనివర్సిటీ ఆదేశం!
-
Sports News
CWG 2022: మేం రజతం గెలవలేదు.. స్వర్ణం కోల్పోయాం: శ్రీజేశ్
-
Politics News
Rajagopalreddy: మాజీ ఎంపీలతో కలిసి బండి సంజయ్‌తో రాజగోపాల్ రెడ్డి భేటీ
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Latestnews News
Whatsapp: వాట్సాప్ నుంచి ప్రైవసీ ఫీచర్లు.. ఇక మీ ‘జాడ’ కనిపించదు!
-
Sports News
Renuka Singh : కామన్వెల్త్లో అదరగొట్టిన రేణుకా సింగ్.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Money: వ్యక్తి అకౌంట్లోకి రూ.6వేల కోట్లు.. పంపిందెవరు?
- Andhra news: నడిరోడ్డుపై వెంటాడి కానిస్టేబుల్ హత్య
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (09/08/2022)
- Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!
- Vijay Deverakonda: బాబోయ్.. మార్కెట్లో మనోడి ఫాలోయింగ్‌కి ఇంటర్నెట్ షేక్
- Sita Ramam: బాలీవుడ్, టాలీవుడ్లో నాకు ఆ పరిస్థితే ఎదురైంది: రష్మిక
- Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్‌లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్‌ప్రీత్ కౌర్
- PM Modi: ఆస్తులేవీ లేవు.. ఉన్న కాస్త స్థలాన్ని విరాళంగా ఇచ్చిన ప్రధాని!
- దంపతుల మాయాజాలం.. తక్కువ ధరకే విమానం టిక్కెట్లు, ఐఫోన్లంటూ..
- Railway ticket booking: 5 నిమిషాల ముందూ ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు..!