Published : 22 May 2022 08:40 IST

British Airways: హైదరాబాద్‌- లండన్‌ విమానంలో తెలుగు సహాయక సిబ్బంది

దిల్లీ: హైదరాబాద్‌-లండన్‌ విమాన సర్వీసులో సహాయకులుగా(క్యాబిన్‌-క్రూ) 20 మంది తెలుగు మాట్లాడేవారిని నియమించినట్లు బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ శనివారం తెలిపింది. ఈ సంస్థ దిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ల నుంచి లండన్‌కు వారానికి 28 సర్వీసులు నడుపుతోంది. తాజాగా హైదరాబాద్‌ నుంచి లండన్‌కు స్థానిక సిబ్బందితో విమానాన్ని నడిపినట్లు పేర్కొంది. ఇకపై హైదరాబాద్‌ నుంచి నడిచే ప్రతి సర్వీసులో తెలుగు సహాయకులు ఉంటారని..  ప్రయాణికులకు బ్రిటిష్‌ శైలి సేవలను తెలుగు భాష, ఆచారాలతో అందించడమే లక్ష్యమని సంస్థ అధికారి కాలమ్‌ లామింగ్‌ తెలిపారు.

Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని