Updated : 23 May 2022 12:22 IST

Andhra News: పెళ్లి పీటలపై కుప్పకూలిన వరుడు.. మరో యువకుడితో పెళ్లి చేసిన పెద్దలు

హొళగుంద, పెద్దకడబూరు, న్యూస్‌టుడే: కొన్ని గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు అనారోగ్యంతో కుప్పకూలాడు. దీంతో వధువుకు మరో అబ్బాయితో వివాహం జరిపించిన ఘటన కర్నూలు జిల్లా హొళగుంద మండలం గజ్జహల్లి గ్రామంలో జరిగింది. బంధువులు తెలిపిన వివరాలు మేరకు.. గ్రామానికి చెందిన యువతికి పెద్దకడబూరు మండలం చిన్న తుంబళం గ్రామానికి చెందిన హనీఫ్‌(23)తో వివాహం నిశ్చయమైంది. ఆదివారం వివాహం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. సరిగ్గా పెళ్లి క్రతువు జరిగే సమయంలో వరుడు హనీఫ్‌కు ఛాతిలో నొప్పిరావటంతో హుటాహుటిన కర్ణాటక రాష్ట్రం శిరగుప్పలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించారు. అనంతరం వధువు తల్లిదండ్రులు తమ సమీప బంధువైన హొళగుంద మండలం వందవాగిలి గ్రామానికి చెందిన నబిరసూల్‌తో వివాహం చేశారు.


Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts