
Telangana News: తల్లి మరణం ఒకవైపు.. ‘పరీక్ష’ మరోవైపు..
దుఃఖంలోనూ ‘పది’ పరీక్ష రాసిన ఇద్దరు విద్యార్థులు
చిగురుమామిడి, గంగాధర, న్యూస్‌టుడే: ఇంటి వద్ద తల్లి మృతదేహం.. గుండెల నిండా కొండంత దుఃఖం.. మరోవైపు అనివార్యంగా పరీక్ష రాయాల్సిన పరిస్థితి. వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు పదో తరగతి విద్యార్థులకు ఎదురైన విషాదఘట్టాలివి. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన వంగ శ్రీనివాస్, శ్రీలతల పెద్ద కుమారుడు రాహుల్ పదో తరగతి చదువుతున్నాడు. ఆర్థిక సమస్యల నేపథ్యంలో శ్రీలత బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె మృతదేహం ఇంటి వద్ద ఉండగానే.. తప్పనిసరై రాహుల్ వెళ్లి ఆంగ్లం పరీక్ష రాసి వచ్చాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండకు చెందిన గుడి నిఖిల్‌రెడ్డి కరీంనగర్ జిల్లా గంగాధరలో పదో తరగతి చదువుతున్నాడు. ఆయన తల్లి మమత అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. అప్పటికే పరీక్ష రాసి తల్లి అంత్యక్రియలకు హాజరైన నిఖిల్‌రెడ్డి.. బుధవారం ఆంగ్లం పరీక్షకు హాజరయ్యాడు.
వడదెబ్బతో విద్యార్థి మృతి!
సంగారెడ్డి గ్రామీణం, న్యూస్‌టుడే: పదో తరగతి పరీక్ష రాసి ఇంటికి వెళ్తున్న ఓ విద్యార్థి మార్గమధ్యలో నీరు తాగి హఠాన్మరణం చెందాడు. సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ఖాన్పేట్కు చెందిన ఎం.శ్రీనివాస్(17) అదే గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు. బుధవారం సంగారెడ్డిలో పదో తరగతి పరీక్ష రాశాడు. తరవాత మిత్రులతో కలిసి ఇంటికి వెళ్తుండగా దాహమేస్తోందని మార్గమధ్యలోని దుకాణంలో నీరు కొనుక్కొని తాగాడు. క్షణాల్లోనే మృత్యువాతపడ్డాడు. స్థానికులు ప్రైవేటు వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా.. అప్పటికే మరణించినట్టు తెలిపారు. ఎండలో వెంటనే నీరు తాగడం, వడదెబ్బ కారణాలతో శ్రీనివాస్ మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs ENG: ఇంగ్లాండ్‌తో టీ20, వన్డేలకు.. టీమ్ఇండియా ఆటగాళ్ల ఎంపిక
-
Related-stories News
Sonu sood: కుమారుడి చికిత్స కోసం ఓ తల్లి తాపత్రయం.. సోనూసూద్ పేరుతో ఆన్లైన్ మోసం
-
Politics News
Shivsena: శివసేన ముందు ముళ్లబాట!
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
General News
LPG: భారీగా తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర
-
Related-stories News
Andhra News: ప్రొబేషన్ వేళ.. గతేడాది ఆందోళనలో పాల్గొన్న వారి పేర్లతో ‘హిట్ లిస్ట్‌లు’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
- Andhra News: రూ.వందల కోట్ల ఆర్థిక మాయ!
- Uddhav thackeray: ఉద్ధవ్ లెక్క తప్పిందెక్కడ?
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్‌ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత!
- ‘ఉడత ఊపితే’ తీగలు తెగుతాయా!
- Maharashtra Crisis: ఫడణవీస్ ఎందుకు సీఎం బాధ్యతలు చేపట్టలేదంటే?
- Income Tax Rules: రేపటి నుంచి అమల్లోకి రాబోతున్న 3 పన్ను నియమాలు..
- Eknath Shinde: మహారాష్ట్ర సీఎంగా శిందే
- ఈ మార్పులు.. నేటి నుంచి అమల్లోకి..