Android 13: ఆండ్రాయిడ్ 13 గురించి గూగుల్ చెప్పిన సంగతులివే!
ఇంటర్నెట్‌డెస్క్: గూగుల్ టెక్ పండుగ గూగుల్ ఐ/ఓ 2022లో కంపెనీ పలు కొత్త ఉత్పత్తులను పరిచయం చేసింది. వీటితోపాటు ఆండ్రాయిడ్ తర్వాతి తరం ఓఎస్ ఆండ్రాయిడ్ 13ను కూడా ఈ యాన్యువల్ డెవలపర్స్ (గూగుల్ ఐ/ఓ 2022) సదస్సులో విడుదల చేసింది. యూజర్ల గోప్యత, భద్రతపరంగా మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఆండ్రాయిడ్ 13లో కొత్త ఫీచర్లను తీసుకొస్తున్నట్లు గూగుల్ వెల్లడించింది. మరి ఆండ్రాయిడ్ 13లో ఎలాంటి ఫీచర్లు ఇస్తున్నారో చూద్దాం.
1. ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌లో కొత్తగా ఇన్స్టాల్ చేసుకున్న యాప్‌లు పుష్ నోటిఫికేన్స్ ఇవ్వాలంటే యూజర్ అనుమతి తప్పనిసరి. అలానే యాప్‌లకు ఫైల్స్ అండ్ మీడియా మొత్తం యాక్సెస్ ఇవ్వకుండా యాప్‌లో షేర్ చేయాలనుకుంటున్న ఫొటో/వీడియో/ఆడియో ఫైల్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు. దీని వల్ల యాప్‌లు యూజర్ ఫోన్లోని అన్ని మీడియా ఫైల్స్‌ను యాక్సెస్ చేయలేవు. గతంలో కొత్తగా యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫోన్లోని ఫైల్స్ అండ్ మీడియాను యాక్సెస్ చేసేందుకు అనుమతించాల్సిందే.
2. అలానే ఎస్సెమ్మెస్ టెక్ట్స్ (మెసేజింగ్) యాప్‌లో కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం గూగుల్ నెట్వర్క్ ఆపరేటర్లు, ఫోన్ తయారీ కంపెనీలతో కలిసి పనిచేయనుంది. మెసేజింగ్ భద్రతపరంగా మరింత పటిష్ఠపరిచేందుకు ఆండ్రాయిడ్ 13లో గూగుల్ మెసేజింగ్‌లో రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ అనే ఫీచర్‌ను పరిచయం చేశారు. దీనికి ఇతర మెసేజింగ్ యాప్‌ల తరహాలో ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ భద్రత ఉంటుంది. అంతేకాకుండా గూగుల్ మెసేజ్ యాప్ నుంచి యూజర్స్ హై-క్వాలిటీ ఫొటోలు/వీడియోలు షేర్ చేసుకోవచ్చు.
3. ఆండ్రాయిడ్ 13లో గూగుల్ వ్యాలెట్ యాప్‌లో మరో కీలక ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ యాప్‌లో యూజర్స్ నగదుతోపాటు హోటల్ తాళాలు (డిజిటల్), ఆఫీస్ కార్డ్స్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి వాటిని స్టోర్ చేసుకోవచ్చు. ఉదాహరణకు యూజర్ వ్యాలెట్‌లో మెట్రో కార్డు స్టోర్ చేశారనుకుందాం. మెట్రో ఎక్కిన తర్వాత యూజర్ వ్యాలెట్ గూగుల్ మ్యాప్స్‌లో మీరు దిగాల్సిన స్టేషన్, మెట్రో కార్డులో నగదు వివరాలు చూపిస్తుంది. ఒకవేళ మీరు దిగాల్సిన స్టేషన్‌కు అయ్యే ఛార్జి కంటే తక్కువ మొత్తం మెట్రో కార్డులోఉంటే నగదు యాడ్ చేసుకోమని సూచిస్తుంది.
4. అత్యవసర సమయంలో యూజర్లు తమను తాము సురక్షితంగా ఉంచుకునేందుకు వీలుగా ఈఎల్ఎస్ (ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీసెస్) అనే ఫీచర్ ఆండ్రాయిడ్ 13లో పరిచయం చేస్తున్నారు. దీంతో యూజర్లు భూకంపం, వరదలు, అగ్నిప్రమాదాలు వంటి విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు తమ ఉనికిని ఇతరులకు తెలియజేసేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. అలానే వేర్ ఓఎస్ (గూగుల్, శాంసంగ్ వాచ్‌లు ఈ ఓఎస్‌తోనే పనిచేస్తాయి)లో ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ త్వరలో పరిచయం చేయనున్నట్లు గూగుల్ వెల్లడించింది.
5. ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌ను పెద్ద డిస్ప్లే కలిగిన ట్యాబ్‌లు ఉపయోగించుకునేందుకు వీలుగా రూపొందించినట్లు గూగుల్ తెలిపింది. అలానే యూజర్స్ తరచుగా ఉపయోగించే యాప్‌లను సులువుగా యాక్సెస్ చేసేందుకు వీలుగా సైడ్ బై సైడ్ యాప్ ట్రే ఫీచర్‌ను ఆండ్రాయిడ్ 13లో పరిచయం చేశారు.
6. గూగుల్ తొలి నుంచి చెబుతున్నట్లుగానే గోప్యత, భద్రతపరంగా ఎప్పటికప్పుడు యూజర్‌కు సూచనలు చేసేలా ఆండ్రాయిడ్ 13ను అభివృద్ధి చేశారు. గతంలో ఫోన్లోని ఏదైనా యాప్ అనుమతి లేకుండా యూజర్ క్లిప్ బోర్డ్‌లోని సమాచారాన్ని యాక్సెస్ చేయాలనుకుంటే వెంటనే ఫోన్లో అలర్ట్ మెసేజ్ కనిపిస్తుంది. తాజా అప్డేట్లో క్లిప్ బోర్డ్‌లోని హిస్టరీని ఆండ్రాయిడ్ ఎప్పటికప్పడు డిలీట్ చేస్తుంది. దీంతో యాప్‌లు సమాచారాన్ని యాక్సెస్ చేయలేవు. అలానే అప్పటివరకు సేకరించిన సమాచారం యాప్ డెవలపర్స్‌కు పంపడం సాధ్యంకాదు.
7. యూజర్ ఫోన్ గోప్యత, భద్రతకు సంబంధించి ఆండ్రాయిడ్ 13లో మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు. దీంతో యూజర్ ఫోన్ డేటా ప్రైవసీ, భద్రతకు సంబంధించిన సమాచారం ఎప్పకప్పుడు క్రోడీకరించి యూజర్‌కు తెలియజేస్తుంది. దీని వల్ల యూజర్ డేటా భద్రత మరింత మెరుగవుతుందని గూగుల్ వెల్లడించింది.
8. మొబైల్ యాప్‌లలో యూజర్లు తమకు నచ్చిన భాషను ఎంచుకునేలా పర్-యాప్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ పేరుతో మరో ఫీచర్‌ను అప్డేట్ చేసింది. దీంతో యూజర్లు కొన్ని యాప్‌లను తమకు నచ్చిన భాషలో ఉపయోగించుకోవచ్చు. అలానే తెలుగు, తమిళం వంటి నాన్-లాటిన్ స్క్రిప్ట్ భాషలు ఫోన్లో మరింత మెరుగ్గా కనపడేలా ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌లో కొత్తగా టెక్ట్స్ కన్వర్షన్ ఏపీఐను తీసుకువస్తోంది. దీనివల్ల ఫాంట్, ఎమోజీలు కూడా ఏ సైజులో అయినా స్పష్టంగా కనిపిస్తాయి.
9. గతంలో క్లౌడ్ స్టోరేజ్‌లో ఉన్న ఫొటోలు ఇతరులకు షేర్ చేయాలంటే వాటికి సంబంధించిన యాప్‌లలోకి వెళ్లి షేర్ చేయాల్సిందే. ఆండ్రాయిడ్ 13లో ఈ సమస్యకు గూగుల్ పరిష్కారం చూపింది. మొబైల్ గ్యాలరీ నుంచే క్లౌడ్ స్టోరేజ్‌లోని ఫొటోలు ఇతరులకు షేర్ చేసేలా సరికొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనివల్ల యూజర్ గోప్యత, భద్రతకు ఎలాంటి ప్రమాదం ఉండబోదని గూగుల్ తెలిపింది.
10. చివరగా ఆండ్రాయిడ్ 13ను పరీక్షించాలనుకునే యూజర్లు బీటా వెర్షన్‌ను ఆండ్రాయిడ్ 13 డెవలపర్స్ పేజ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఆండ్రాయిడ్ 13 బీటా వెర్షన్‌ను కొన్ని కంపెనీల చెందిన ఫోన్లు మాత్రమే సపోర్ట్ చేస్తాయి. గూగుల్ పిక్సెల్ ఫోన్లు, వన్‌ప్లస్ 10 ప్రో, అసుస్ జెన్ 8, నోకియా ఎక్స్20, ఒప్పో ఫైండ్ ఎన్, ఒప్పో ఫైండ్ ఎక్స్5 ప్రో, రియల్మీ జీటీ 2 ప్రో, వివో ఎక్స్ 80 ప్రో, షావోమి 12 సిరీస్ ఫోన్లు ఈ జాబితాలో ఉన్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Andhra News: ఎంపీ కేశినేని నాని పిటిషన్‌కు విచారణ అర్హత ఉంది: ఏపీ హైకోర్టు
-
General News
Sweets: బంగారు పూత పూసిన స్వీట్.. ఈ మధుర పదార్థం ధరెంతో తెలుసా..?
-
India News
Independence Day: స్వాతంత్ర్య స్ఫూర్తి.. 15న లఖ్‌నవూలో వినూత్నంగా..!
-
Politics News
Basavaraj Bommai: కర్ణాటకలో సీఎం మార్పు ఊహాగానాలు.. స్పందించిన బొమ్మై!
-
General News
Telangana News: క్యాసినో కేసులో చీకోటి ప్రవీణ్ వినతిని పరిగణించాలి: హైకోర్టు
-
Movies News
Social Look: యశ్, మహేశ్ ‘రాఖీ’ విషెస్.. ఈ హీరోయిన్ల సోదరులని చూశారా!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Lal Singh Chaddha: రివ్యూ: లాల్ సింగ్ చడ్డా
- Viral Video: పిల్లలకు తిండిపెట్టాలా? చంపుకోవాలా?.. ఓ తల్లి ఆవేదన!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (11/08/2022)
- Vishal: షూటింగ్లో ప్రమాదం.. నటుడు విశాల్‌కు తీవ్ర గాయాలు
- IT Raids: వ్యాపారి ఇళ్లల్లో నోట్ల గుట్టలు.. లెక్కించడానికే 13 గంటలు!
- YS Vijayamma: వైఎస్ విజయమ్మకు తప్పిన ప్రమాదం
- Tollywood Movies: ఈ వసూళ్లు చూసి సంబరాలు చేసుకోకూడదు: తమ్మారెడ్డి భరద్వాజ
- IT Jobs: ఐటీలో వలసలు తగ్గుతాయ్
- Prashant Kishor: నీతీశ్ అందుకే భాజపాను వీడారు..!
- Hanumakonda: రైలెక్కించి పంపారు.. కాగితాల్లో చంపారు