స్వచ్ఛ కంప్యూటర్‌కు పంచ సూత్రాలు..
ఇంటర్నెట్ డెస్క్: సాంకేతిక అందుబాటులోకి వచ్చాక గ్యాడ్జెట్ల వినియోగం పెరిగింది. అయితే వీటికి కూడా వైరస్ ముప్పు పొంచి ఉండటంతో కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్ కొన్న వెంటనే వాటిలో యాంటీ వైరస్‌ను ఇన్స్టాల్ చేస్తుంటాం. యాంటీ వైరస్ ఉంటే గ్యాడ్జెట్స్ సురక్షితం అన్న భరోసాతో వాటిని ఇన్స్టాల్ చేస్తాం. అయితే వీటిని కూడా ధర చెల్లించి కొనుగోలు చేయాల్సిరావడంతో చాలా మంది ఆన్లైన్లో దొరికే ఉచిత యాంటీ వైరస్ల వైపు మొగ్గు చూపుతున్నారు. వీటిలో కొన్ని మోసపూరితమైనవి కావడంతో అవి వైరస్ నుంచి రక్షణ కల్పించలేకపోతున్నాయి.
ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ ఫోన్లు, కంప్యూటర్ల కోసం యూజర్స్‌కి కేంద్ర ఎలక్ట్రానిక్స్, సాంకేతిక సమాచార మంత్రిత్వ శాఖ కొన్ని యాంటీ వైరస్‌లను సూచించింది. ఇవన్నీ సైబర్ స్వచ్ఛ కేంద్ర (సీఎస్కే - బాట్నెట్ క్లీనింగ్ అండ్ మాల్వేర్ అనాలసిస్ సెంటర్)లో భాగంగా పనిచేస్తాయని తెలిపింది. ఇవి యూజర్స్ ఆండ్రాయిడ్ ఫోన్లు, కంప్యూటర్లలను బాట్నెట్ (హ్యాకర్స్ సమాచార తస్కరణకు ఉపయోగించే కార్యాచరణ) దాడుల బారిన పడకుండా రక్షణ కల్పిస్తాయని తెలిపింది. వీటన్నింటినీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ-ఇన్) ఆపరేట్ చేస్తుంది. ఇందుకోసం సీఈఆర్టీ బృందం క్విక్ హీల్, ఈస్కాన్తో కలిసి పనిచేస్తుంది. ఈ యాంటీ వైరస్‌లను సీఎస్కే వెబసైట్లోని సెక్యూరిటీ టూల్స్ విభాగం నుంచి ఎవరైనా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి అవేంటో చూద్దామా..
* మైక్రోసాఫ్ట్ విండోస్ ఓఎస్‌తో పనిచేసే కంప్యూటర్ల కోసం క్విక్ హీల్ (Quick Heal Free Bot Removal Tool), ఈస్కాన్ (eScan Antivirus) కంపెనీలు ఉచిత బాట్ రిమూవల్ టూల్‌ని అందిస్తున్నాయి. వీటిని డౌన్లోడ్ లింక్‌లపై క్లిక్ చేస్తే ఆయా వెబ్సైట్లు ఓపెన్ అవుతాయి. అందులోనే యాంటీ వైరస్లు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో వివరిస్తూ టూల్ కిట్ కూడా ఉంటుంది. క్విక్ హీల్ యాంటీ వైరస్ - డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి, ఈస్కాన్ యాంటీ వైరస్ - డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి
* ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం ఈ స్కాన్ కంపెనీ బాట్ రిమూవల్ టూల్‌ని అందిస్తుంది. దీన్ని గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి
* మనం తరచుగా పెన్‌డ్రైవ్, ఎక్స్టర్నల్ హార్డ్‌డ్రైవ్, మొబైల్ ఫోన్లతో పాటు ఇతర యూఎస్బీ స్టోరేజ్ డివైజ్‌లను కంప్యూటర్‌కి కనెక్ట్ చేస్తాం. కొన్నిసార్లు వాటితో కూడా వైరస్ వచ్చే ప్రమాదం ఉంది. వీటిని నిరోధించేందుకు సెంటర్ ఫర్ డెవలెప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీడాక్) యూఎస్బీ ప్రతిరోధ్ (USB Pratirodh) పేరుతో యాంటీ వైరస్‌ను అందిస్తుంది. డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి
* మొబైల్ ఫోన్లలానే డెస్క్‌టాప్ కంప్యూటర్లకు కూడా ఎన్నో రకాల యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటి ద్వారా వైరస్ కంప్యూటర్లలో ప్రవేశించకుండా సీడాక్ యాప్సమ్విద్ (AppSamvid) పేరుతో యాంటీ వైరస్‌ను అందిస్తుంది. డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి
* మనకు కావాల్సిన సమాచారం కోసం వెబ్ బ్రౌజింగ్ చేస్తుంటాం. అయితే కొన్ని సార్లు మన ప్రమేయం లేకుండా మాల్వేర్ వెబ్సైట్ల ద్వారా హ్యాకర్స్ దాడి చేస్తారు. దీన్ని నిరోధించేందుకు సీడాక్ సంస్థ బ్రౌజర్ ఎక్స్టెన్షని అందిస్తుంది. బ్రౌజర్ జేఎస్ గార్డ్ (Browser JS Guard) పేరుతో గూగుల్ క్రోమ్, ఫైర్ఫాక్స్ బ్రౌజర్ ఎక్స్టెన్షలలో ఇది అందుబాటులో ఉంది. క్రోమ్ ఎక్స్టెన్షన్ - డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి , ఫైర్ఫాక్స్ ఎక్స్టెన్షన్ - డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి
నోట్: ఈ యాంటీ వైరస్లు డౌన్లోడ్ చేసుకునే ముందు మీ కంప్యూటర్ 32-బిట్ లేదా 64-బిట్ అనేది నిర్ధారించుకుని దానికి అనువైన వెర్షన్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి.
ఇవీ చదవండి..
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
AP TET: పార్వతీపురం అభ్యర్థికి చెన్నైలో టెట్ పరీక్ష కేంద్రం
-
Ts-top-news News
NIT Warangal: 3 వేలలోపు ర్యాంకులకే కంప్యూటర్ సైన్స్ సీటు
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (11/08/2022)
-
India News
75th Independence Day: ఎర్రకోట వేడుకల్లో.. అత్యాధునిక తుపాకులతో ‘గన్ సెల్యూట్’
-
World News
Death Valley: డెత్ వ్యాలీలో వరద బీభత్సం.. అరుదైన వర్షపాతం నమోదు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (11/08/2022)
- Prashant Kishor: నీతీశ్ అందుకే భాజపాను వీడారు..!
- Viral Video: చీమల్ని తిన్న వీడియోకు 10మిలియన్ల వ్యూస్!
- రైలెక్కించి పంపారు.. కాగితాల్లో చంపారు
- Rohit sharma: ఈ ప్లాన్‌తోనే భారత క్రికెట్‌కు మంచి భవిష్యత్‌ను అందిస్తాం: రోహిత్ శర్మ
- Aamir Khan: ‘గత 48గంటల నుంచి నేను నిద్రపోలేదు’ : ఆమిర్‌ఖాన్
- Shilpa Shetty: చిత్రీకరణలో గాయపడ్డ శిల్పాశెట్టి
- Death Valley: డెత్ వ్యాలీలో వరద బీభత్సం.. అరుదైన వర్షపాతం నమోదు
- సెక్స్ కోరే అమ్మాయిలు వేశ్యలతో సమానం: నటుడు వివాదాస్పద వ్యాఖ్యలు
- Pancreatitis: కడుపులో నొప్పిగా ఉంటుందా..? ఇది ఎలా వస్తుందో తెలుసా..