యాపిల్ ఫోల్డింగ్ ఫోన్..ఇలానే ఉంటుందా!

మార్కెట్లో ఎన్ని మోడల్స్‌ ఉన్నా ఫోల్డింగ్ ఫోన్ ప్రత్యేకత వేరు. అవసరమైనప్పుడు పెద్దదిగా..లేదంటే చిన్న స్క్రీన్‌తో ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. త్వరలో యాపిల్ కూడా ఫోల్డింగ్ ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది...

Published : 18 Feb 2021 19:50 IST

(Photo Credit: ConceptsiPhone)

ఇంటర్నెట్ డెస్క్‌: మార్కెట్లో ఎన్ని మోడల్స్‌ ఉన్నా ఫోల్డింగ్ ఫోన్ ప్రత్యేకత వేరు. అవసరమైనప్పుడు పెద్దదిగా..లేదంటే చిన్న స్క్రీన్‌తో ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. ఇప్పటికే శాంసంగ్, మోటోరోలా, ఎల్‌జీ వంటి కంపెనీలు ఫోల్డింగ్ పోన్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. త్వరలో యాపిల్ కూడా ఫోల్డింగ్ ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా దానికి సంబంధించిన వివరాలివేనంటూ కొన్ని ఫీచర్స్ ఆన్‌లైన్‌లో సందడి చేస్తున్నాయి. అవేంటో చూద్దాం..

* ఈ ఫోన్ స్క్రీన్ మొత్తంలో ఎక్కడ తాకినా ఫోన్‌ అన్‌లాక్‌ అయ్యేలా ఆల్‌-స్క్రీన్ టచ్‌ ఐడీ ఇస్తున్నారు. అంటే స్క్రీన్ మీద స్వైప్ చేస్తే ఫోన్ అన్‌లాక్ అవుతుంది. ఏ15 బయోనిక్ ప్రాసెసర్‌ను ఉపయోగిస్తున్నారని సమాచారం. 

* అలానే ఇందులో ఫేస్‌ఐడీ మరింత వేగంగా, చిన్నదిగా ఉంటుందని సమాచారం. నాలుగు స్పీకర్స్ ఇస్తున్నారని తెలుస్తోంది. 5జీ కనెక్టివిటీ,  ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్స్‌ ఉంటాయి. ఈ ఫోన్ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 30 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తుందట. 

* లైడార్‌ 2 సెన్సర్‌తో కొత్త కెమెరా సిస్టం ఇస్తున్నారు. అయితే సెల్ఫీ కెమెరా స్క్రీన్ కింది భాగంలో ఉంటుందా లేక పంచ్ హోల్ డిస్‌ప్లే ఇస్తారా అనేది తెలియాల్సివుంది. వెనక మూడు కెమెరాలు ఇస్తున్నారని తెలుస్తోంది. వీటిలో టెలీ, వైడ్, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలు ఉంటాయట. 

*  రెండు డిస్‌ప్లేలతో ఐదు రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. ఫోన్ మూసినప్పుడు 6.3-అంగుళాల డిస్‌ప్లే, ఫోన్ పూర్తిగా తెరిస్తే  8-అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. అయితే ఫోన్ స్క్రీన్‌పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. 7.3 లేదా 7.6-అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇస్తారని పలువురు టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తారని అంచనా. 

Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని