Published : 03 Jun 2022 16:11 IST

Instagram: ఇన్‌స్టా రీల్స్‌ ఇక 90 సెకన్లు..

ఇంటర్నెట్‌ డెస్క్‌: కంటెంట్‌ క్రియేటర్లను దృష్టిలో పెట్టుకొని ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) కొత్త ఫీచర్లను ప్రకటించింది. తమ వినియోగదారులకు మరింత దగ్గరయ్యేలా రీల్స్‌ (Reels) నిడివిని 90 సెకన్ల వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. తద్వారా యూజర్లు తమ భావాలను మరింత మెరుగ్గా వ్యక్తపరిచే వీలుంటుందని మెటా యాజమాన్యం (Meta) తెలిపింది. అంతేకాకుండా ఈ రీల్స్‌కు ఇతర వీడియోల నుంచి తమ సొంత ఆడియోను జోడించుకోవచ్చని పేర్కొంది.

రీల్స్‌ కోసం పోల్స్‌

ఇందుకు ముందుగా కెమెరా రోల్‌లో కనీసం ఐదు సెకన్ల నిడివి ఉన్న ఏదైనా వీడియోను ఎంచుకోవాలి. ఆపై ఆ వీడియోలోని వ్యాఖ్యానం లేదా నేపథ్య సంగీతాన్ని జోడించడానికి ఆడియో ఫీచర్‌ను ఉపయోగించాల్సి ఉంటుందని ఇన్‌స్టా వివరించింది. అలాగే తమ తదుపరి రీల్స్‌కు సంబంధించి కంటెంట్‌ క్రియేటర్లు పోల్స్‌ నిర్వహించుకోవచ్చు. ఈ పోల్స్‌ ద్వారా తమ ప్రేక్షకులకు ఏం కావాలో, ఏం ఇష్టపడుతున్నారో తెలుసుకోవచ్చు. అందుకు అనుగుణంగా ప్రేక్షకులు ఇష్టపడే కొత్త రీల్స్‌నే క్రియేటర్లు చేయవచ్చు. ఇందుకోసం కొత్త ఫీచర్‌ను విడుదల చేస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.

మరోవైపు, స్టోరీలకు పరిమితి విధించే పనిలో భాగంగా ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త లేఅవుట్‌ (Stories new layout)ను తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఈ కొత్త లేఅవుట్‌లో కేవలం 3 స్టోరీలు మాత్రమే ఫాలోవర్లకు కనిపిస్తాయి. మిగిలిన స్టోరీలనూ చూడాలంటే ఫాలోవర్లు ‘షో ఆల్‌ (Show All)’ అనే బటన్‌ క్లిక్‌ చేయాల్సి ఉంటుంది.

Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts