Published : 11 Aug 2021 22:39 IST

Instagram: ఇన్‌స్టాలో ఇకపై  అలాంటి కామెంట్స్‌ బంద్‌

అసభ్యకర సందేశాలను నియంత్రించేందుకు  ‘లిమిట్స్‌’ ఫీచర్‌ అందుబాటులోకి..

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేసే ఫొటోలు, రీల్స్‌కి నెగిటివ్‌ కామెంట్స్‌ చేస్తున్నారన్న ఫిర్యాదులు ఇటీవల యూజర్ల నుంచి ఎక్కువగా వస్తున్నాయి. అందుకే వాటిని నియంత్రించేందుకు సరికొత్త ఫీచర్‌ని ప్రవేశపెట్టామని ఇన్‌స్టా హెడ్‌ ఆడమ్ మోసేరి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘ ఇన్‌స్టా యూజర్ల అకౌంట్స్‌ను సురక్షితంగా ఉండేలా చూసే బాధ్యత మాపై ఉంది. ఇక్కడ దూషించే, ద్వేషించే కామెంట్స్‌ని సహించము. అలా ఎవరైనా కామెంట్‌ చేస్తే కచ్చితంగా వాటిని తీసి వేస్తాం. అందుకే ‘లిమిట్స్‌’ అనే కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చాం. దీన్ని తేలికగా ఆపరేట్‌ చేసుకోవచ్చు. దీన్ని ఆన్‌ చేస్తే పరిమితమైన కామెంట్స్‌, మెసేజ్‌ రిక్వెస్ట్‌లు మాత్రమే వస్తాయి. అంతే కాదు మీరు ఫాలో అవ్వని వారి నుంచి ఎలాంటి అసభ్యకరమైన కామెంట్స్‌ వచ్చే అవకాశం ఉండదు.’’ అని వివరించారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా పదేపదే అసభ్యకర సందేశాలు పంపిస్తున్నారని మీదృష్టికి వస్తే మాత్రం కమ్యూనిటీ గైడ్ లైన్స్‌ప్రకారం.. వారి కామెంట్‌ని డిలీట్‌ లేదా హైడ్‌ చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ వాడే వారి సంఖ్య 120 మిలియన్ల మందితో రెండో స్థానంలో ఉండగా... 140 మిలియన్ల ఇన్‌స్టా యూజర్లతో మొదటి స్థానంలో అమెరికా నిలిచింది.

Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని