Published : 17 Sep 2021 19:32 IST

Ipad mini Network: ఐపాడ్‌ మినీకి కొత్త టెక్నాలజీ సపోర్ట్‌ ఉండదా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: యాపిల్‌ సంస్థ ఐఫోన్‌ 13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసేసింది. ఐఫోన్‌ 13 సిరీస్‌తో పాటు ఆరో జనరేషన్‌ ఐపాడ్‌ మినీని కూడా లాంచ్‌ చేసింది. ఐఫోన్ 13 సిరీస్‌ ఫోన్లు mmWave 5G సపోర్ట్‌ చేస్తాయి. అయితే కొత్తగా తీసుకొస్తున్న ఐపాడ్‌ మినీకి mmWave 5G సపోర్ట్‌ చేయదని టెక్‌ వర్గాలు పేర్కొన్నాయి. హైయ్యర్ ఫ్రీకెన్సీ రేడియో బ్యాండ్స్‌ సాంకేతికత mmWave 5Gలో ఉంటుంది. దీని వల్ల సాధారణ 5G సేవల కంటే అధిక వేగం పొందే అవకాశం ఉంటుంది. అయితే ఐపాడ్‌ మినీ mmWave 5G సపోర్ట్‌తో రాకపోయినా స్పీడ్‌లో మాత్రం ఎలాంటి మార్పూ ఉండబోదని నిపుణులు చెబుతున్నారు. ఐపాడ్‌ మినీ A 15 బయోనిక్‌ ప్రాసెసర్‌తో పని చేయనుంది. ఐపాడ్ మినీ mmWave 5Gను సపోర్ట్‌ చేయకపోయినా.. తక్కువ, మిడ్‌ బ్యాండ్ 5జీ సపోర్ట్‌తో 5G సేవలను పొందవచ్చు. సెప్టెంబర్‌ 24 నుంచి అమ్మకాలు మొదలు కానున్నట్లు యాపిల్‌ వెల్లడించింది. ఐపాడ్‌ మినీ (6వ జనరేషన్‌) స్పెసిఫికేషన్స్‌ ఏంటో ఓసారి చూద్దాం...

స్పెసిఫికేషన్స్‌

* డిస్‌ప్లే: 8.3 అంగుళాలు లిక్విడ్‌ రెటినా ట్రూ టోన్‌

* స్టోరేజీ: 64 జీబీ, 256 జీబీ

* చిప్‌సెట్‌: యాపిల్‌ A 15 బయోనిక్‌

* ఫ్రంట్‌ కెమెరా: 12 ఎంపీ అల్ట్రావైడ్‌

* రేర్ కెమెరా: 12 ఎంపీ

* బ్యాటరీ: అప్‌టూ 10 గంటల వరకు

* ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ఓఎస్‌): ఐపాడ్‌ ఓఎస్ 15

* యాపిల్‌ పెన్సిల్‌ సపోర్ట్‌: యస్‌

* ఐపాడ్‌ కీబోర్డ్‌ సపోర్ట్: లేదు

* స్పీకర్స్‌: స్టీరియో విత్‌ లాండ్‌స్కేప్‌ మోడ్‌

* సెక్యూరిటీ: టచ్‌ ఐడీ

* కలర్స్‌: పర్పల్‌, పింక్‌ రంగుల్లో కూడా లభించే అవకాశం

* ధర: రూ. 30వేల నుంచి రూ. రూ .45 వేల మధ్య ఉండొచ్చు

Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని