ఐఫోన్ 13లో అదిరిపోయే ఫీచర్స్..అవేంటంటే!

గతేడాది ఐఫోన్ 12 సిరీస్‌ ఫోన్లతో సందడి చేసిన యాపిల్‌ ఈ ఏడాది ఐఫోన్ 13 మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుందట. అయితే ఈ ఫోన్‌ ఫీచర్స్‌ గురించి ఇప్పటికే పలు రకాల వార్తలు వెబ్‌ విహారం చేశాయి. తాజాగా ఈ ఐఫోన్ 13కి సంబంధించిన మరికొన్ని వివరాలను టెక్‌ వర్గాలు వెల్లడించాయి...

Published : 22 Jan 2021 23:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గతేడాది ఐఫోన్ 12 సిరీస్‌ ఫోన్లతో సందడి చేసిన యాపిల్‌ ఈ ఏడాది ఐఫోన్ 13 మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుందట. అయితే ఈ ఫోన్‌ ఫీచర్స్‌ గురించి ఇప్పటికే పలు రకాల వార్తలు వెబ్‌ విహారం చేశాయి. తాజాగా ఈ ఐఫోన్ 13కి సంబంధించిన మరికొన్ని వివరాలను టెక్‌ వర్గాలు వెల్లడించాయి. అవేంటో చూద్దాం..ఐఫోన్‌ 13 ముందు భాగంలో డాట్‌ ప్రొజెక్టర్‌తో ఇన్‌ఫ్రారెడ్ కెమెరాను ఒకే మాడ్యూల్‌గా ఇవ్వనున్నారట. దీని వల్ల ఫోన్ ముందు భాగంలో నాచ్‌ సైజ్‌ తగ్గనుంది. అలానే కొత్త ఫోన్లను ఐఫోన్‌ 13 లేదా ఐఫోన్ 12ఎస్‌ పేరుతో ఈ ఏడాది ద్వితీయార్ధంలో మార్కెట్లోకి తీసుకొస్తారని అంచనా. దానితో పాటు వీటిలో ఎల్‌ఐడీఏఆర్‌ స్కానర్‌ ఉపయోగించనున్నారట. ఇప్పటి వరకు ఈ స్కానింగ్ టెక్నాలజీని కేవలం ఐఫోన్ ప్రో మోడల్స్‌లో మాత్రమే ఉపయోగించారు. 

అంతేకాకుండా ఐఫోన్ 13 మోడల్‌లో సెన్సార్‌ షిఫ్ట్‌ ఓఐఎస్‌ (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) ఉంటుందని టెక్‌ వర్గాల అంచనా. ప్రస్తుతం ఈ ఫీచర్ ఐఫోన్ 12 ప్రో మాక్స్‌లో మాత్రమే ఉంది. ఈ ఫీచర్‌తో ఫొటో తీసే సమయంలో సెన్సార్‌కి బదులు లెన్స్‌ కదులుతాయి. అలానే ఐఫోన్ 13లో అద్భుతమైన ఫొటోగ్రఫీ అనుభూతిని అందించేందుకు అపార్చర్‌ సైజ్‌ను f/2.4 నుంచి f/1.8కి మార్చనున్నారని పలువురు టిప్‌స్టర్స్‌ అభిప్రాయపడుతున్నారు. 1టీబీ స్టోరేజ్‌, 120Hz రిఫ్రెష్‌ రేట్‌ సామర్థ్యంతో, ఎల్‌పీవో డిస్‌ప్లే డిజైన్ చేస్తున్నట్లు టెక్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

ఇవీ చదవండి..

రెడ్‌మీ తొలి గేమింగ్ ఫోన్..ఎప్పుడంటే..!

‘Y’ సిరీస్‌లో వివో కొత్త ఫోన్లు..ధరెంతంటే..!

Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని