Published : 08/12/2021 01:40 IST

AR Rahman: మా అమ్మాయిలకు నేనిచ్చే సలహా అదే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: పిల్లలు ఎదగడం, వారు కన్న కలలను నిజం చేసుకునేందుకు కష్టపడటం.. వీటిని చూసే తల్లిదండ్రులకు ఇంతకు మించిన మంచి అనుభూతి మరొకటి ఉండదనే చెప్పాలి. ఆస్కార్‌ అవార్డు గ్రహీత, సంగీత విద్వాంసుడు ఏఆర్ రెహమాన్‌ ఇప్పుడు అదే అనుభూతిని పొందుతున్నారు. ఆయన కుమార్తెలు రహీమా రెహమాన్‌, ఖతీజా రెహమాన్‌ ఇద్దరూ సంగీతకారులుగా రాణిస్తున్నారు. ఈఏడాది వచ్చిన కృతిసనన్‌ ‘మిమి’ చిత్రంలో ‘రాక్‌ ఏ బై బేబీ’ పాటతో అదరగొట్టారు ఖతేజా. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా మీ కూతుర్లకు ఏమైనా సలహా ఇస్తారా అని అడిగిన ప్రశ్నకు ఏఆర్‌ రెహమాన్‌ మాట్లాడుతూ.. ‘‘ రహీమా, ఖతేజా ఇద్దరిదీ మొండి మనస్తత్వం. వాళ్లు ది బెస్ట్‌ ఇవ్వాలనుకుంటారు. ఈక్రమంలో వాళ్లకు నేను పదేపదే చెప్పే విషయం ఒకటే. ‘ దేని గురించి దిగులు చెందకండి . చేయాలనుకున్న పనిని చేయండి. అప్పుడే మీకంటూ సొంత వ్యక్తిత్వం అలవడుతుంది. ఇతరులతో పోల్చుకోవద్దు’ అని చెబుతాను. నేను కుర్రాడిగా ఉన్నప్పుడు 30-60 ఏళ్ల వయసు వాళ్లతో కలిసి పనిచేశాను. వాళ్లందరి నుంచి నేను నేర్చుకున్న విషయమేమిటంటే.. పని పట్ల నిబద్ధత. ఇప్పుడూ కూడా అదే విషయాన్ని రివర్స్‌లో యూత్‌ నుంచి నేర్చుకుంటున్నా. యువతలో ఉండే ఉత్సాహం నన్ను ప్రేరేపిస్తుంది. వారితో కలిసి పనిచేస్తుంటే అప్పటి క్షణాలను ఆస్వాదిస్తున్నా’’ అన్నారు.

Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని