
Updated : 12 Jan 2022 17:18 IST
AP News: ఏఐజీలో చేరిన కొడాలి నాని, వంగవీటి రాధా
ఈనాడు, అమరావతి: పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) కరోనా బారినపడ్డారు. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.
♦ తెదేపా నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు స్వల్ప లక్షణాలు కన్పించగా, వైద్య పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఆయన కూడా ఏఐజీలో చేరారు. రాధా ఈనెల 9న కంచికచర్లలో రంగా విగ్రహావిష్కరణకు హాజరుకాగా.. పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.
Tags :