Viral Video: బర్గర్‌ కోసం అలిగిన బుడ్డోడు..

చిన్నారులు ఒక్కోసారి వాళ్లకు కావలసింది ఇవ్వకపోతే అలుగుతారు. ఆ అలుకలో

Published : 23 Jul 2021 23:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్: చిన్నారులు ఒక్కోసారి వాళ్లకు కావాల్సింది ఇవ్వకపోతే అలుగుతారు. ఆ అలుకలో ఎంతో ముద్దుగా కనిపిస్తారు. ఆ విధంగా బర్గర్‌ కోసం అలిగిన ఓ పిల్లాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతోంది. 

ఈ వీడియోలో కుర్తా పైజామా వేసుకుని కనిపిస్తున్న పిల్లాడి సోదరి ఒక బర్గర్‌ ఆర్డర్‌ చేసింది. కానీ, అది అతనికి పెట్టలేదు. దాంతో అలిగిన ఆ పిల్లాడు తలుపు వెనుక దాక్కొని ‘‘నాతో ఎవరూ మాట్లాడకండి’’ అని కోపగించుకున్నాడు. మరో బర్గర్‌ ఆర్డర్‌ చేయడానికి నాన్నని డబ్బులు అడగమని అతని సోదరి ఆటపట్టించగా మరింత కోపంగా.. ‘‘మీ బర్గర్‌ మీరే తినండి.. నేను తినను’’ అని అనడం ముద్దుగా అనిపిస్తోంది. చివరకి బుడ్డోడు విసుగుచెంది ‘‘ నా కోసం ఏమీ ఆర్డర్‌ చేయొద్దు.. నేను ఏమీ తినను.. ఆకలితోనే ఉంటాను..’’ అని లేచి వెళ్లి పోవడం నవ్వులు పూయిస్తోంది. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని