Published : 16/02/2021 01:25 IST

యానాం ఎమ్మెల్యే పదవికి మల్లాడి రాజీనామా

యానాం: పుదుచ్చేరిలోని యానాం శాసన సభ్యత్వానికి మల్లాడి కృష్ణారావు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని పుదుచ్చేరి శాసన సభాపతి వీపీ శివకొలుందుకు పంపారు. 1996 నుంచి నియోజకవర్గం నుంచి మల్లాడి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 6న పుదుచ్చేరి ప్రభుత్వం నుంచి ఉత్తమ శాసన సభ్యుడి అవార్డుతో పాటు రాజకీయ రజతోత్సవ పురస్కారాన్ని అందుకున్నారు. జనవరి 7న ఆరోగ్య శాఖ మంత్రి పదవికి రాజీనామా చేస్తూ సంబంధిత పత్రాలను సీఎంకు అందజేశారు. ఇంతవరకు సదరు రాజీనామాకు సీఎం ఆమోదం తెలపలేదు. ఈ నేపథ్యంలో తన శాసన సభ్యత్వానికి సైతం రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. 

Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని