Viral: వానరాల రోప్‌వే చూశారా!

ప్రకృతి ఒడి లాంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్లి రోప్‌వే ఎక్కితే పర్యాటకులకు కలిగే అనుభూతే వేరు. మరి ఆ మజా తమకు వద్దా? అనుకున్నాయో.. ఏమో ఈ వానరాల గుంపు! పచ్చటి ప్రదేశాలకు వెళ్లి మానవులు చేసే అదే అల్లరిని.........

Published : 09 Mar 2021 23:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రకృతి ఒడి లాంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్లి రోప్‌వే ఎక్కితే పర్యాటకులకు కలిగే అనుభూతే వేరు. మరి ఆ మజా తమకు వద్దా? అనుకున్నాయో.. ఏమో ఈ వానరాల గుంపు! పచ్చటి ప్రదేశాలకు వెళ్లి మానవులు చేసే అదే అల్లరిని కాంక్రీటు అభయారణ్యంలో చేసి చూపించాయి. అగ్గిపెట్టెల్లాంటి భవనాల మధ్య ఉన్న కేబుల్‌ తీగలపై.. ఒకదానిని మించి మరోటి పోటీ పడుతూ వినూత్న రీతిలో రోప్‌వేపై జారుతూ తెగ సందడి చేశాయి. సాధారణ మనుషులకైతే ఇది ఒళ్లు గగుర్పొడిచే సాహాసమే అయినప్పటికీ.. వానరాలు కదా సునాయాసంగా చేసేశాయి. ఎక్కడ జరిగిందో తెలీదు గానీ ఈ కోతుల గుంపు చేసిన సందడిని ఓ జంతు ప్రేమికుడు కెమెరాలో బంధించగా.. అటవీ శాఖ అధికారి పర్వీన్‌ కాస్వాన్‌ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. ఆ సందడిని మీరూ చూసేయండి..


Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని