Published : 27 Jan 2022 15:58 IST

Nani: ‘దసరా’ మూవీ కోసం అంత ఖర్చుతో భారీ సెట్‌?

హైదరాబాద్‌: యువ కథానాయకుడు నాని(Nani) వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. గతేడాది డిసెంబరులో ‘శ్యామ్‌ సింగరాయ్‌’తో మెప్పించిన ఆయన ఇటీవలే ‘సుందరానికి తొందరెక్కువ’ చిత్రీకరణ పూర్తి చేసుకున్నారు. త్వరలోనే మరో సినిమా కోసం రంగంలోకి దిగబోతున్నారు. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో నాని నటిస్తున్న 29వ చిత్రం ‘దసరా’. కీర్తిసురేశ్‌ కథానాయిక. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. పూర్తి విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ కథలో నాని డిఫరెంట్‌ లుక్‌లో కనిపించనున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రత్యేకంగా విలేజ్‌ సెట్‌ను తీర్చిదిద్దుతోందట. ఇందుకోసం ఏకంగా రూ.12కోట్లు ఖర్చు చేయనున్నట్లు టాలీవుడ్‌ టాక్‌. మెజార్టీ భాగం ఇక్కడే చిత్రీకరించనున్నారు. దీంతో ఈ విషయంలో చిత్ర బృందం అస్సలు రాజీపడకూడదని భావిస్తోందట.  ‘శ్యామ్‌ సింగరాయ్‌’ కోసం కోల్‌కతాను తలపించేలా సెట్‌ను తీర్చిదిద్దిన ఆర్ట్‌ డైరెక్టర్‌ అవినాశ్‌ కొల్ల దీనికి పనిచేస్తున్నారు. గోదావరిఖని మైన్స్‌ నేపథ్యంలో కథ సాగనున్నట్లు తెలుస్తోంది. అందుకు తగినట్లుగానే సెట్‌ను రూపొందిస్తున్నారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు రోషన్‌ మాథ్యూ కీలక పాత్ర పోషిస్తున్నారు.


Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని