Published : 17 Jan 2022 13:20 IST

Ap News: ప్రాణాలతో చెలగాటమాడొద్దు.. సెలవులు పొడిగించండి: నారా లోకేశ్‌

అమరావతి: రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నందున విద్యాసంస్థలకు ప్రకటించిన సెలవులు పొడిగించాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కోరారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌కు లోకేశ్‌ లేఖ రాశారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయని.. తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు మరో రెండు వారాల పాటు విద్యాసంస్థలకు సెలవులు పొడిగించాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సెలవులు పొడిగిస్తూ తక్షణమే ఉత్తర్వులు జారీ చెయ్యాలని లోకేశ్‌ డిమాండ్ చేశారు.

‘‘15 ఏళ్ల లోపు పిల్లలకు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రాణాలతో చెలగాటమాడొద్దు. గత 10 రోజుల్లో ఏపీలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. 10 రోజుల వ్యవధిలోనే రోజుకి 500 కేసుల నుంచి 5 వేల వరకు నమోదయ్యే పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో పాఠశాలలు ప్రారంభించడం పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థుల తల్లిదండ్రులను మరింత మానసిక క్షోభకు గురిచెయ్యకుండా ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు పొడిగించాలి. తక్షణమే సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి’’ అని పేర్కొన్నారు.

Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని