Published : 20 Aug 2021 22:46 IST

UNICEF: ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఇద్దరు చిన్నారుల్లో ఒకరు బాధితులే

వాతావరణ మార్పుల దుష్ప్రభావాలపై యూనిసెఫ్‌ ఆందోళన

న్యూయార్క్‌: ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఇద్దరు చిన్నారుల్లో ఒకరు వాతావరణ మార్పుల కారణంగా ఉత్పన్నమవుతున్న అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో నివసిస్తున్నారని యూనిసెఫ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తం పిల్లల సంఖ్య 2.2 బిలియన్లు కాగా.. ఒక బిలియన్‌, అంటే దాదాపు సగం మంది బాధితులేనని తెలిపింది. సెంట్రల్ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌, చాడ్‌, నైజీరియా, గినియా తదితర దేశాల్లో సమస్య తీవ్రంగా ఉందని పేర్కొంది. ‘ది క్లైమెట్‌ క్రైసిస్‌ ఈజ్‌ ఏ చైల్డ్‌ రైట్స్‌ క్రైసిస్‌: ఇంట్రడ్యూసింగ్‌ ది చిల్డ్రెన్స్‌ క్లైమెట్‌ రిస్క్‌ ఇండెక్స్‌’ పేరిట రూపొందించిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడించింది. చిన్నారుల జీవన ప్రమాణాల విషయంలో వరదలు, తుపానులు, వడగాలులు, వాయు కాలుష్యం, అంటువ్యాధులు తదితర అంశాల ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని మొదటి సారి సమగ్ర విశ్లేషణ చేసినట్లు తెలిపింది.

‘బాలల హక్కులను నీరుగారుస్తున్నాయి’

‘వాతావరణ, పర్యావరణ ఉత్పాతాలు.. బాలల హక్కులను నీరుగారుస్తున్నాయి. పరిశుభ్రమైన గాలి, ఆహారం, నీరు, విద్య, ఆవాసం, స్వేచ్ఛ, ఆఖరుకు వారి జీవించే హక్కుపై కూడా ప్రభావం చూపుతున్నాయి’ అని యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రిట్టా ఫోర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు, సంబంధిత సంస్థలు.. సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని యూనిసెఫ్‌ పిలుపునిచ్చింది. గ్రీన్‌హౌస్‌ ఉద్గారాలను 2030 నాటికి కనీసం 45 శాతం తగ్గించాలని సూచించింది. ఈ దిశగా అందరిలో అవగాహన పెంచాలని, వాతావరణ మార్పులకు సంబంధించిన విధివిధానాల రూపకల్పనలో యువతనూ భాగస్వాములు చేయాలని పేర్కొంది.

Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts