Updated : 10 May 2022 22:23 IST

Telangana news: రెండుసార్లు జైలులో పెట్టారు.. అయినా వెనక్కి తగ్గం!

హైదరాబాద్‌: గత వారం ఓయూలో ఆందోళన కేసులో అరెస్టయిన ఎన్‌ఎస్‌యూఐ నేతలు చంచల్‌గూడ జైలు నుంచి మంగళవారం విడుదలయ్యారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ సహా 18 మందికి నాంపల్లి కోర్టు బెయిల్‌ ఇవ్వడంతో విడుదలయ్యారు. ఈ సందర్భంగా వెంకట్‌ మాట్లాడుతూ.. ‘‘ ప్రభుత్వం కావాలనే మమ్మల్ని అరెస్టు చేసింది. మా నేతలతో ములాఖత్‌ కాకుండా అడ్డుకుంది. మూడు సార్లు జైల్లో పెట్టారు.. అయినా వెనక్కి తగ్గం. విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన మరింత పోరాడతాం. కేసులు పెట్టి విద్యార్థుల గళాలను అణిచివేయాలని చూస్తున్నారు’’ అని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జైలు నుంచి విడుదలైన అనంతరం వెంకట్‌ సహా 18 మంది టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కలిశారు.

Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని