Published : 27/11/2021 20:22 IST

గో ఫస్ట్‌ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌.. ప్రయాణికులకు తప్పిన ముప్పు!

నాగ్‌పూర్‌ (మహారాష్ట్ర): బెంగళూరు నుంచి పట్నా వెళ్లాల్సిన గో ఫస్ట్‌ (ఒకప్పుడు గో ఎయిర్‌) విమానయాన సంస్థకు చెందిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో శనివారం ఉదయం విమానానాన్ని అత్యవసరంగా దించివేశారు. విమానంలో సిబ్బందితో కలిపి 139 మంది ఉన్నారు. ప్రమాదం తప్పడంతో అందరూ ఊపరిపీల్చుకున్నారు.

బెంగళూరు నుంచి పట్నాకు వెళ్తుండగా విమానంలోని ఓ ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్‌ నాగ్‌పూర్‌ ఏటీసీని సంప్రదించాడు. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతివ్వాలని కోరాడు. దీంతో నాగ్‌పూర్‌ విమానాశ్రయ సిబ్బంది అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతిచ్చారు. విమానం ల్యాండింగ్‌ సమయంలో రన్‌వేని విమానాశ్రయ అధికారులు ఖాళీ చేయించారు. అగ్నిమాపక వాహనాలతో పాటు, అంబులెన్సులు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. విమానం సురక్షితంగా ల్యాండ్‌ అవ్వడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం ప్రయాణికులందరిన్నీ వేరే విమానంలో పట్నా పంపించినట్లు గో ఫస్ట్ ఓ ప్రకటనలో తెలిపింది. సాంకేతిక సమస్య ఏర్పడిన విమానాన్ని ఇంజినీర్ల బృందం తనిఖీ చేస్తోందని పేర్కొంది.

Read latest National - International News and Telugu News

Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని