Poco Laptop: పోకో ల్యాప్‌టాప్స్ వచ్చేస్తున్నాయ్.. ఫీచర్లివేనా!
పొకో కంపెనీ త్వరలోనే భారత మార్కెట్లో కొత్త ల్యాప్‌టాప్‌ను తీసుకురానుంది. అలానే పొకో బ్రాండ్ కింద స్మార్ట్‌వాచ్, ట్రూవైర్‌లెస్ ఇయరబడ్స్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్‌డెస్క్: ప్రస్తుత ట్రెండ్ ప్రకారం ఇంటగెలిచి రచ్చ గెలవాలనే సామెతను స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ఆదర్శంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. కేవలం మొబైల్ రంగానికే పరిమితం కాకుండా ట్యాబ్, ల్యాప్‌టాప్, స్మార్ట్‌వాచ్ వంటి ఉత్పత్తులను కూడా తయారు చేస్తున్నాయి. ఇప్పటికే షావోమి, రియల్‌మీ, యాపిల్ కంపెనీలు ఫోన్లతోపాటు స్మార్ట్‌వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లను రూపొందిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో పోకో సంస్థ కూడా చేరనుంది. పోకో బ్రాండ్‌తో త్వరలోనే ల్యాప్‌టాప్‌లను భారత్ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం పోకో కంపెనీ ఈ ల్యాప్‌టాప్‌కు సంబంధించి జీ16బీ01డబ్ల్యూ పేరుతో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది. అలానే పోకో కంపెనీ ల్యాప్‌టాప్‌తోపాటు బ్లూటూత్ వైర్‌లెస్ (టీడబ్ల్యూఎస్) ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్‌లను కూడా విడుదల చేయనుందట.
బీఐఎస్‌కు సమర్పించిన సమాచారం ప్రకారం పోకో ల్యాప్‌టాప్‌లో 3,620 ఎంఏహెచ్ బ్యాటరీ, 144 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 16 అంగుళాల డిస్‌ప్లే ఇస్తున్నారట. అలానే ఈ ల్యాప్‌టాప్‌లో 11 జనరేషన్ సీపీయూతోపాటు ఏఎమ్‌డీ రైజెన్ 7 ప్రాసెసర్‌ను ఉపయోగించినట్లు తెలుస్తోంది. 16 ర్యామ్, 512జీబీ ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్ వేరియంట్లో ఈ ల్యాప్‌టాప్‌ను తీసుకురానుంది. ఇందులో డీటీఎస్-ఎక్స్ అల్ట్రా 3డీ సౌండ్, వైఫై6 కనెక్టివిటీ, యూఎస్‌బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్, త్రీ-లెవెల్ బ్యాక్‌లిట్ కీబోర్డ్, షియో ఏఐ డిజిటల్ అసిస్టెంట్ వంటి ఫీచర్లుంటాయని తెలుస్తోంది. అలానే గేమర్స్ కోసం ఈ ల్యాప్‌టాప్‌లో ప్రత్యేక ఫీచర్లుంటాయట. దీని ధర రూ. 40 వేల నుంచి రూ. 50 వేల మధ్య ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. అయితే పోకో ల్యాప్‌టాప్‌లోని ఫీచర్లతో ఇప్పటికే రెడ్‌మీ ఒక ల్యాప్‌టాప్‌ను చైనా మార్కెట్లో విడుదల చేసిందని టెక్ వర్గాలు తెలిపాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
TSPSC: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్.. లావాదేవీలపై సిట్ ఆరా
-
Sports News
IND vs AUS : ‘రోహిత్-కోహ్లీ’ మరో రెండు పరుగులు చేస్తే.. ప్రపంచ రికార్డే
-
Politics News
KTR: మన దగ్గరా అలాగే సమాధానం ఇవ్వాలేమో?: కేటీఆర్
-
Movies News
Ugadi: ఉగాది జోష్ పెంచిన బాలయ్య.. కొత్త సినిమా పోస్టర్లతో టాలీవుడ్లో సందడి..
-
India News
Aadhaar: ఆధార్.. ఓటర్ ఐడీ అనుసంధానానికి గడువు పెంపు..!
-
Technology News
Legacy Contact: వారసత్వ నంబరు ఎలా?