Updated : 04 Apr 2022 05:01 IST

Ram Charan: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కు రామ్‌చరణ్‌ ‘బంగారు’ కానుక

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్టీఆర్‌తో కలిసి రామ్‌చరణ్‌ నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న నేపథ్యంలో రామ్‌చరణ్‌ చిత్ర బృందాన్ని సర్‌ప్రైజ్‌ చేశారు. ఈ సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణులతో కలిసి అల్పాహారం తిని, కాసేపు వారితో ముచ్చటించారు. అనంతరం, సినిమా విజయంపై ఆనందం వ్యక్తం చేసిన ఆయన సుమారు 35 మందికి (స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌, కెమెరా అసిస్టెంట్లు తదితరులు) తులం బంగారు కాయిన్లను (RRR లోగోతో ఉన్న) కానుకగా అందించారు.

పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ అలరించారు. అలియా భట్‌, ఒలివియా మోరీస్‌, శ్రియ, అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ భారీ బడ్జెట్‌ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు.

Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts