Updated : 29 Jan 2022 13:54 IST

Rashmi: జూ సిబ్బందిపై రష్మీ ఆగ్రహం..

హైదరాబాద్‌: మూగజీవాలపై ఎంతో ప్రేమను కనబరుస్తుంటారు నటి, వ్యాఖ్యాత రష్మీ. మూగజీవాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందంటూ తరచూ ఆమె పోస్టులు పెడుతుంటారు. ఈ నేపథ్యంలో దిల్లీలోని ఓ జూలో జరిగిన ఘటన పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దిల్లీలోని ప్రముఖ జూలో ఎన్నో సంవత్సరాలుగా ఓ భారీ నీటి ఏనుగు ఉంది. దాన్ని చూసేందుకు సందర్శకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇటీవల ఆ నీటి ఏనుగు తన కేజ్‌ నుంచి బయటకు తల పెట్టి చూస్తుండగా.. అక్కడే ఉన్న సెక్యూరిటీ  దాన్ని లోపలికి పంపించేందుకు తలపై కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియోని ఓ నెటిజన్‌ షేర్‌ చేయగా.. అది చూసిన రష్మీ ఆగ్రహానికి లోనయ్యారు. జంతువుల పట్ల జూ సిబ్బంది వ్యవహరించిన తీరు బాధాకరమని పేర్కొన్నారు. ‘‘లాక్‌డౌన్‌ సమయంలో మూడు నెలలపాటు ఇంట్లో ఉండటానికి మనం ఎంతో ఇబ్బందిపడ్డాం. అలాంటిది జీవితాంతం వాటిని బంధిస్తే అవి ఎంతలా బాధపడతాయో ఒక్కసారి ఆలోచించండి’’ అంటూ రష్మీ పోస్ట్‌ పెట్టారు. బ్యాన్‌ జూ అనే ట్యాగ్‌ని జత చేశారు.

Read latest Latest News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని