Updated : 19 Feb 2022 17:28 IST

Rohit Sharma: టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ..

ఇంటర్నెట్‌ డెస్క్: టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌ రోహిత్ శర్మను టెస్టుల్లో కూడా సారథిగా నియమిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఓపెనర్‌ కేఎల్ రాహుల్‌, వికెట్‌కీపర్‌ రిషభ్ పంత్‌లలో ఒకరిని సుదీర్ఘ ఫార్మాట్‌లో కెప్టెన్‌గా నియమిస్తారని వార్తలు వచ్చినప్పటికీ సెలక్టర్లు రోహిత్‌ వైపే మొగ్గుచూపారు. దీంతో అన్ని ఫార్మాట్లలో టీమ్ఇండియాకు రోహిత్‌ శర్మ సారథ్యం వహించనున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ ముగిసిన అనంతరం సుదీర్ఘ ఫార్మాట్‌ సారథిగా తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. మార్చి 4 నుంచి స్వదేశంలో శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ టెస్టుల్లో పూర్తిస్థాయి కెప్టెన్‌గా మొదటి పరీక్ష. ఈ సిరీస్‌ కోసం బీసీసీఐ టీమ్‌ఇండియా జట్టును ప్రకటించింది. జస్ప్రీత్‌ బుమ్రాను వైస్‌ కెప్టెన్‌గా నియమించారు. అజింక్యా రహానె, ఛెతేశ్వర్‌ పూజారాలను జట్టు నుంచి తప్పించారు. మొహాలీ వేదికగా మార్చి 4 నుంచి 8 వరకు మొదటి టెస్టు,  బెంగళూరు వేదికగా మార్చి 12 నుంచి 16 వరకు (డే/నైట్) రెండో టెస్టు జరగనుంది. టెస్టు సిరీస్‌కు ముందు శ్రీలంకతో భారత్‌ మూడు టీ20లను ఆడనుంది. ఫిబ్రవరి 24న (లఖనవూ), 26న (ధర్మశాల), 27న (ధర్మశాల) మ్యాచ్‌లు జరుగుతాయి. దీంతో లంకతో సిరీస్‌లకు బీసీసీఐ జట్లను ప్రకటించింది.

టెస్టు జట్టు: 

రోహిత్‌ శర్మ (కెప్టెన్), మయాంక్‌ అగర్వాల్, ప్రియాంక్‌ పంచాల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయాస్‌ అయ్యర్‌, హనుమ విహరి, శుభమన్‌ గిల్, రిషభ్ పంత్‌ (వికెట్‌కీపర్‌), కేఎస్ భరత్, అశ్విన్‌ (ఫిట్‌నెస్‌గా ఉంటే), రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్‌, కుల్దీప్‌ యాదవ్‌, బుమ్రా (వైస్‌ కెప్టెన్‌), షమి, సిరాజ్‌, ఉమేశ్ యాదవ్‌, సౌరభ్ కుమార్‌. 

టీ20 జట్టు: 

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), జస్ప్రీత్ బుమ్రా (వైస్‌కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్, శ్రేయాస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌ (వికెట్ కీపర్‌), వెంకటేశ్‌ అయ్యర్‌, దీపక్‌ చాహర్‌, దీపక్‌ హుడా, రవీంద్ర జడేజా, యుజేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, కుల్దీప్‌ యాదవ్‌, సిరాజ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, హర్షల్‌ పటేల్, అవేశ్‌ఖాన్‌.


Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని