ఫ్లయింగ్‌స్క్వాడ్ల పనితీరుపై ఎస్‌ఈసీ అసంతృప్తి

గ్రేటర్‌ ఎన్నికల సందర్భంగా ఫ్లయింగ్‌ స్క్వాడ్ల పనితీరుపై రాష్ట్ర ఎన్నికల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. స్పష్టమైన ఆదేశాలు

Updated : 30 Sep 2022 15:12 IST

హైదరాబాద్‌: గ్రేటర్‌ ఎన్నికల సందర్భంగా ఫ్లయింగ్‌ స్క్వాడ్ల పనితీరుపై రాష్ట్ర ఎన్నికల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ అనేక ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొంది. పెద్ద సంఖ్యలో వస్తున్న ఫిర్యాదుల ఎన్నికల సంఘానికి ఇబ్బందిగా మారిందని ఆందోళన వ్యక్తం చేసింది. రేపు పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో ఇవాళ రాత్రి అత్యంత కీలకమని, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థులు అక్రమాలకు పాల్పడే అవకాశముందని హెచ్చరించింది. ఈ విషయంలో ఎన్నికల పరిశీలకులు ప్రత్యేకంగా దృష్టిసారించాలని స్పష్టం చేసింది. ఫ్లయింగ్‌ స్క్వాడ్లు, స్టాటిక్‌ సర్వేలెన్స్‌ బృందాలను అప్రమత్తం చేయాలని ఆదేశించింది. ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని.. చట్టప్రకారం కేసులు నమోదుచేయాలని సూచించింది. 

Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు