Updated : 22 Jul 2021 08:00 IST

HYD: బజాజ్‌ చేతక్‌..బార్బిక్యూ ఘుమఘుమ

పాత స్కూటర్‌.. దానికి తోడుగా ఏదో పెట్టె.. ఎవరీ వ్యక్తి? ఏమిటీ కథ??

చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు భాస్కర్‌.. సొంతూరు ఏపీ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలోని యలమంచిలి. పదేళ్ల క్రితం నగరానికి వచ్చాడు. బంజారాహిల్స్‌ వెంకటగిరి ప్రాంతంలో ఉంటూ కారు డ్రైవరుగా పనిచేసేవాడు. కరోనా దెబ్బతో బతుకుబండి దారితప్పింది. ఏం చేయాలో తోచని స్థితి. అయినా ధైర్యం చేశాడు.. ఉన్న సొమ్ముతో ఓ పాత స్కూటర్‌, వంటసామగ్రి కొన్నాడు.. మాంసాహార వంటకాల్లో మెలకువలు తెలిసుండటంతో దాన్నే ఉపాధి మార్గంగా మలచుకున్నాడు.. మాదాపూర్‌ ఐటీ కారిడార్‌లో పాదబాట పక్కన తన స్కూటర్‌ను ఆపి బార్బిక్యూ వంటకాలను సిద్ధం చేస్తున్నాడు.. బొగ్గుల మంటపై వేడివేడిగా వాటిని తయారుచేస్తూ ఆహార ప్రియులను ఆకట్టుకుంటున్నాడు.. వాహనాన్ని వ్యాపారానికి అనువుగా మార్చుకునేందుకు రూ.లక్షన్నర ఖర్చయిందన్న భాస్కర్‌.. ఇపుడు రోజూ ఆరేడు వేల వరకూ బిజినెస్‌ నడుస్తోందన్నాడు. వారాంతాల్లో వ్యాపారం ఇంకాస్త బాగుంటుందంటున్నారు.

- ఈనాడు, హైదరాబాద్‌

Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts