
Published : 21 Aug 2021 08:08 IST
Akhrot: అక్రోట్లు తింటే ఆయుర్దాయం పెరుగుదల.. ‘హార్వర్డ్’ అధ్యయనంలో వెల్లడి
బోస్టన్: అక్రోట్లు (వాల్నట్స్) తింటే వృద్ధుల్లో ఆయుర్దాయం పెరుగుతుందని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యయనం తెలిపింది. ‘‘ఆరోగ్యం మెరుగుపరచుకోవాలనుకొనే వృద్ధులు అక్రోట్లు తినాలి. జీవితకాలం పెరుగుతుంది. వారానికి ఐదు అంతకంటే ఎక్కువ సార్లు (ఒక్కసారికి 28గ్రాములు) తింటే మరణ ముప్పు 14 శాతం, గుండె సంబంధిత వ్యాధుల ముప్పు 25 శాతం తగ్గుతుంది. అంతేకాదు.. వాల్నట్స్ తినని వారితో పోలిస్తే 1.3 సంవత్సరాలు ఎక్కువ జీవిస్తారు. అదే వారానికి రెండు నుంచి నాలుగు సార్లు తింటే మరణ ముప్పు 13 శాతం, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం 14 శాతం తగ్గుతుంది. జీవితకాలం ఒక సంవత్సరం పెరుగుతుంది’’ అని పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయనాన్ని ‘జర్నల్ న్యూట్రింట్స్’ ప్రచురించింది.
Advertisement
Tags :