
Updated : 17 Oct 2021 08:02 IST
T20 World Cup: ఒమన్ జట్టులో కవాడిగూడ క్రికెటర్
కవాడిగూడ, న్యూస్‌టుడే: హైదరాబాద్ కవాడిగూడకు చెందిన శ్రీమంతుల సందీప్ గౌడ్ ఆదివారం ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌లో ఒమన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. 29 ఏళ్ల సందీప్.. 2005-08 మధ్య హైదరాబాద్ అండర్-15, 19 జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2016లో ఉద్యోగం కోసం ఒమన్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డ సందీప్.. అక్కడ దేశవాళీ మ్యాచ్‌ల్లో సత్తా చాటి, జాతీయ జట్టుకు ఆడే అవకాశం అందుకున్నాడు. ఆదివారం ఒమన్.. పపువా న్యూ గినియాతో తొలి మ్యాచ్ ఆడనుంది.
Advertisement
Tags :